ఈ నెల 30న హుజురాబాద్ ఉప ఎన్నికలకు పోలింగ్ నిర్వహించనుండగా, నవంబర్ 3న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వాటి ప్రచారాల్లో దూకుడు పెంచాయి. ఉప ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే గడువు ఉంది. దీంతో బరిలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త వ్యూహ్యాలను ఎంచుకుంటున్నారు. ప్రచారంలో తమ దైన శైలితో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే ప్రైవేటు, ప్రభుత్వ సర్వే సంస్థలు […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అంటూ ఆరోపించారు. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక […]
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఆగ్రస్థానంలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది. పేదవారికి సంజీవినిలా ఉన్న ఈ ఆసుపత్రిలో సౌకర్యాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ విభాగంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజీ డిపార్ట్మెంట్లో డ్యూటీలో ఉన్న భువనశ్రీ అనే మహిళా డాక్టర్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. దీంతో ఆమె తలకు గాయాలయ్యాయి. పేద ప్రజలకు ఆపద్భాంధువులా ఉండే ఈ ఉన్నత శ్రేణి ఆసుపత్రిలో ఇలా జరగడంతో చికిత్సకు వచ్చిన […]
టీఆర్ఎస్ పార్టీ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజుల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. మహిళలను ఆకాశానికెత్తారు. మహిళలు ఎక్కడ పూజించబడతారో అక్కడ రాజ్యం బాగుంటుందన్నారు. మహిళల్లో ప్రతిభావంతులు ఉంటారని, మహిళలు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, మహిళలు ముందు వరుసలో నిలబడాలన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ నేతలకు చురకలు అంటిస్తూ.. సెల్ఫ్ డబ్బా కొట్టుకోలేదని, చేసిందే ఇక్కడ […]
నిరుద్యోగులకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) శుభవార్త చెప్పింది. ఈ మేరకు 64 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ డిఫెన్స్ ఎస్టేట్స్, సీనియర్ సైంటిఫిక్ అధికారి, మెడికల్ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు యూపీఎస్సీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు సంబంధిత పోస్టుల కొరకు నవంబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌లోని పూర్తి వివరాల కోసం upsconline.nic.in వైబ్ […]
ఏపీ సీఎం జగన్ మెహన్ రెడ్డి ఉన్నత విద్యపై విద్యాశాఖ అధికారులతో ఉన్నస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో శిక్షణ నిరంతరం కొనసాగాలని ఆయన అధికారులను ఆదేశించారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌చేయాలి, విద్యాపరంగా మనం వచ్చిన తర్వాత తేడా ఏంటన్నది కనిపించాలని ఆయన అన్నారు. వీసీలు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి, ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలన్నారు. ఉన్నత విద్యలో అనేక మార్పులు తీసుకు వచ్చామని, డిగ్రీని నాలుగేళ్ల కోర్సు […]
ఏపీలో రాజకీయ పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో గాడి తప్పిందని ఆయన అన్నారు. అంతేకాకుండా జగన్ ప్రభుత్వం దివాళా దిశగా సాగుతోందని, అప్పులు తీసుకువస్తే తప్పా రాష్ట్రానికి మనుగడలేని దుర్భర పరిస్థితిలు నెలకొన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఇసుక, ఇటుక, ఉక్కు ధరలు పెరిగి సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయన్నారు. జగన్ ప్రభుత్వం తిరోగమన చర్యలు చేపట్టిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో హామీలు గుప్పించిన జగన్ […]
ఇటీవల జమ్మూకాశ్మీర్ జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు, జేసీవో వీరమరణ పొందారు. దీంతో జవాన్ల వీరమరణం ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల స్థావరం కోసం పోలీసులు గాలిస్తుండగా పూంచ్ జిల్లా మెంధార్ వద్ద ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు తెగబడ్డారు. లష్కరే తొయిబా ఉగ్రవాది జియా ముస్తఫాను ఘటనా స్థలికి తీసుకెళ్లిన పోలీసులు.. కాల్పుల వేళ ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం గుర్తింపుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు పాల్పడడంతో సీఆర్పీఎఫ్ […]
ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు చేసుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకీ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ షాక్ ఇచ్చారు. హుజురాబాద్ ఉప ఎన్నిక తరువాత 15మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో టీఆర్ఎస్ పతనం మొదలైందని, చాలా మంది నేతలు టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్నారన్నారు. తెలంగాణాలో కేసీఆర్ కుటుంబ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెబుతారన్నారు. గాంధీ భవన్‌లోకి గాడ్సే […]
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వ విద్యాలయంలో ఎండీఎస్ (మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జన్) కోర్సులో ప్రవేశాల కొరకు వర్సీటీ నోటీఫికేషన్ ను విడుదల చేసింది. కన్వీనర్, యాజమాన్య కోటలో సీట్లు భర్తీ చేయనున్నట్లు వర్సీటీ వెల్లడించింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటలకు వరకు చివరి దశ వెబ్ అప్షన్ నిర్వహిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు http://knruhs.telangana.gov.in/ లో వెబ్ సైట్లో వెబ్ ఆప్షన్లలో వారివారి ప్రాధాన్యతను బట్టి కళాశాలలను ఎంచుకోవాలని […]