What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- పీఆర్సీపై ఏపీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో నేడు మరోసారి ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపనుంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది.
- జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణే అజెండాగా జీఎస్టీ మండలి సమావేశం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ భేటీ కానున్నారు. అయితే చేనేతపై 12 శాతానికి పన్ను పెంచాలనే నిర్ణయం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
- భారత్-సౌతాఫ్రికా తొలి టెస్ట్ సెంచూరియన్‌లో జరుగుతోంది. అయితే నేడు ఐదో రోజు మ్యాచ్ జరుగనుంది. 4వ రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోర్ 94/4 గా ఉంది. దక్షిణాఫ్రికా లక్ష్యం 305 పరుగులు ఉండగా ఇంకా 211 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ స్కోర్ 327&174 లు ఉండగా, విజయానికి 6 వికెట్ల దూరంలో భారత్ ఉంది.
- నేడు హైదరాబాద్‌లోని పబ్‌లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఇటీవల ఇళ్ల మధ్యలో పబ్‌లు విచ్చలవిడిగా వెలుస్తున్నాయని, పబ్‌ల నుంచి వచ్చే డీజే సౌండ్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో వారి పిటిషన్‌పై విచారణ జరుపుతోంది.
- నేడు ఉత్తరాఖండ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ 23 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
- హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,480లు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 66,300లుగా ఉంది.
- నేడు మేడారంలో ఇద్దరు మంత్రులు పర్యటించనున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌లు పరిశీలించనున్నారు.
- నేటి నుంచి జనవరి 2 వరకు కేరళలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నట్లు ఆ రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఈ నైట్ కర్ఫ్యూ ఉండనుంది. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నిబంధనలు కఠినతరం చేసింది.
- నేడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!