కరోనా మహామ్మరిని కట్టడి చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరోసారి లాక్డౌన్ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా కొన్ని సడలింపులతో లాక్డౌన్ ను తమిళనాడు ప్రభుత్వం పొడిగించింది. నవంబర్ 15వరకు లాక్డౌన్ను పొడిగించిన ప్రభుత్వం.. నవంబర్ 1నుంచి సినిమా థియేటర్లలో 100 శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. దీనితో పాటు నవంబర్ 1 నుంచి 1-8 తరగతులు రోటేషన్ విధానంలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే […]
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ఇంకా నాలుగు రోజులు మాత్రమే మిగిలిఉంది. దీంతో ప్రముఖ రాజకీయ పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒకరిపై మరొకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనడం […]
రాష్ట్రమంతా హుజురాబాద్ ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎక్కడికి వచ్చి మాట్లాడినా అందులో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తప్పక ఉంటోంది. ఈ రోజు కేటీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్, పీసీసీ రేవంత్ రెడ్డిలు రహస్య ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై స్పందించిన బీజేపీ మహిళా నేత డీకే అరుణ హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్, ఈటల భేటీ […]
కరోనా కారణంగా గత సంవత్సరం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేశారు. వారు ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 నుండి నవంబర్ 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ ఒక […]
ఏపీలోని పరిస్థితులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా ఎందుకు నోరు మెదపడం లేదన్నారు. ఏపీ దివాళా తీసింది. లక్షలాది కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నా అభివృద్ధి లేదు. ఏ రంగంలో అభివృద్ధి చెందిందో చెప్పమంటే ఒక్క మంత్రీ సమాధానం చెప్పడం లేదు. అప్పులిస్తే తప్పించి జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. మంత్రులందరూ డమ్మీలు. సీఎంకి సజ్జల వాయిస్. అన్ని శాఖలకి […]
వివాదాస్పద సినిమాలు తీస్తూ ఎప్పుడూ బీజీగా ఉండే డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా కొండామురళికి బర్త్ డే విషెస్ తెలిపారు. ‘కొండా మురళి గారికి, కొండా చిత్ర యూనిట్ నుంచి, మరియు నల్ల బల్లి సుధాకర్ గారి నుంచి, జన్మ దిన శుభాకాంక్షలు’ అంటూ ట్విట్ చేశారు. ప్రస్తుతం కొండా అనే టైటిల్ తో కొండా మురళిపై ఆర్జీవీ సినిమా షూటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో ఎన్ కౌంటర్ చేయబడ్డ ఆర్కే అలియాస్ రామకృష్ణకు […]
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరుఫున ప్రచారం చేసేందుకు కేంద్ర పశు సంవర్థక, మత్స్య, సమాచార శాఖ సహాయ మంత్రి మురుగన్ రానున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బద్వేల్ కు కేంద్ర మంత్రి మురుగన్ చేరుకోనున్నారు. అనంతరం తొలుత పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ కార్యాలయం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకూ రోడ్ షోలో పాల్గొని, నాలుగు రోడ్ల కూడలిలో ఆయన ప్రసంగించనున్నారు. […]
తిరుపతిలో అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వెస్ట్ చర్చ్ సమీపంలో ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వాహనం నీట మునిగింది. దీంతో కర్ణాటకకు చెందిన ఏడుగురు భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు. అతికష్టం మీద ఆరుగురు వ్యక్తులు బయటపడ్డారు. కానీ సంధ్య అనే మహిళ ఊపిరాడక మృతి చెందింది. వీరితో పాటు ప్రయాణిస్తున్న బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన వాహనం వదిలి డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఇప్పటికే వాతావరణ శాఖ […]
హుజురాబాద్ ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచారంలో వేడి పెరుగుతోంది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బీజేపీ సిగ్గులేని రాజకీయాలు మానుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దాడులకు దిగుతోందని బాల్క సుమన్ ఆరోపించారు. బీజేపీ గెలిచే పరిస్థితే ఉంటే.. దాడులకు దిగుతుందా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఫ్రెస్టేషన్లో ఉందని, కిషన్ రెడ్డి తన స్థాయిని మరిచి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. Read Also […]
విజయనగరం వైసీపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విజయనగరం జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ అంబటి అనిల్ గుండె పోటుతో మృతి చెందారు. ఆయన సొంతూరు సాలూరు మండలం సన్యాసిరాజుపేట. జిల్లా పరిషత్ లో అందరి కన్నా చిన్న వయస్సున్న జడ్పీటీసీగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అనిల్ మృతి పట్ల జిల్లా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర మేనల్లుడైన అంబటి అనిల్ మృతి పట్ల వైసీపీ […]