కొండపల్లి మున్సిపల్ ఎన్నికపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. కొండపల్లిలోని 29 స్థానాలకు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ15, వైసీపీ14 స్థానాల్లో గెలుపొందింది. అయితే కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రసాభాసగా సాగడంతో.. టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణ చేపట్టింది. ఉద్యోగ సంఘాలతో పీఆర్సీపై నేడు ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలు జరుపనుంది. అయితే ఈ రోజు సాయంత్రం 5గంటలకు సీఎస్ సమీర్‌శర్మ అధ్యక్షతన ఉద్యోగ సంఘాలు భేటీ […]
జగనన్న గృహ సంకల్ప పథకాన్ని తణుకులో సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 10 వేల కోట్లు రుణమాఫీ వన్ టైం సెటిలేమెంట్ లబ్దిదారులకు అందిస్తున్నామని తెలిపారు. 6 వేల కోట్లు రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ మినహాయింపు లభిస్తుందని, లబ్దిదారుల ఆస్తి 22A లో నిషేధిత ఆస్తిగా ఉండేదని, ఇక నుండి నిషేధిత జాబితా నుండి తొలగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఓటీఎస్ ద్వారా లబ్ది పొందిన వారికి లింక్ డాక్యుమెంట్ కూడా […]
అగ్రరాజ్యమైన అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను సైతం అతలాకుతలం చేస్తోంది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్లు బయట పడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే ప్రపంచ దేశాలు తలమునకలయ్యాయి. కొన్ని దేశాల్లో డెల్టా వేరియంట్ తగ్గుముఖం పట్టినా మరికొన్ని దేశాల్లోనైతే డెల్టా ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది. కరోనా ఎఫెక్ట్‌తో పలు దేశాలు […]
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు గత నెల చివర్లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు 18వ రోజుల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే సభ ప్రారంభం కాగానే రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లిఖింపూర్ ఘటనతో సహా వివిధ అంశాలపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. విపక్ష సభ్యులు ఇచ్చిన వివిధ నోటీసులు చైర్మన్‌కు ఇవ్వడంతో వాటిని చైర్మన్ తిరస్కరించారు. దీంతో రాజ్యసభలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. విపక్ష […]
బెంగుళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది మురుగు కాల్వలను తొలగించడానికి మ్యాన్‌హోల్‌ను శుభ్రం చేయమని దళిత ఉద్యోగిని బలవంతం చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. హాస్పిటల్ హౌస్ కీపింగ్ సూపర్వైజర్ డి. రాజా, గిల్బర్ట్ తో పాటు అడ్మినిస్ట్రేటర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ప్రివెన్షన్ యాక్ట్ -1989లోని సెక్షన్ 3(1) (జె), ప్రొహిబిషన్ ఆఫ్ మాన్యువల్ స్కావెంజింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెక్షన్లు 7,8,9 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు […]
తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు వైసీపీ నేతలు నిర్వహించారు. ఈ వేడకలకు పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు, ఇతర నేతలు హజరయ్యారు. జగన్ జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్ కు […]
విపక్షాలపై వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విపక్షాలు సిద్ధాంతాలను పక్కన పెట్టి ఏకమై రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. అంతేకాకుండా సీఎం జగన్‌కు ప్రజలు అండగా నిలబడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ప్రజలు నీరాజనం పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఓటీఎస్ వరంలాంటిదని ఆయన అభివర్ణించారు. ఏకకాలంలో ఇంటిపై పూర్తి హక్కును పొందేలా జగన్ తీసుకువచ్చిన ఓటీఎస్‌పై ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. […]
పాకిస్థాన్‌లోని కరాచీలో ఓ హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. దేవాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసినందుకు ఒక వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. ఆ వ్యక్తి సాయంత్రం కరాచీలోని రాంచోర్ లైన్ ప్రాంతంలోని హిందూ దేవాలయంలోకి ప్రవేశించి హిందూ దేవత జోగ్ మాయ విగ్రహాన్ని సుత్తితో ధ్వంసం చేశాడు. అయితే అనంతరం నిందితుడిని ప్రజలు పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. స్థానిక మీడియా సమాచారం మేరకు నిందితుడిపై దైవదూషణకు సంబంధించిన సెక్షన్ల కింద కేసు […]
టాలీవుడ్ నిర్మాతలు ఈ రోజు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సంక్రాంతికి పాన్ ఇండియా మూవీలు ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ ఉన్న నేపథ్యంలో భీమ్లానాయక్ సినిమా విడుదల పోస్ట్‌పోన్ తో పాటు మరికొన్ని సినిమాల వివరాలను ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసారం కోసం కింద ఇచ్చిన లింక్‌లో చూడండి.
అగ్రరాజ్యమైన అమెరికా పాలన కార్యాలయం వైట్ హౌస్‌లో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. గత నెలలో కూడా శ్వేత సౌధంలో కరోనా కేసులు బయటకు రావడంతో వైద్యులు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కు పరీక్షలు నిర్వహించారు. కొంతమందిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే తాజాగా మరో కరోనా కేసు వైట్ హౌస్‌లో వెలుగు చూసింది. గత మూడు రోజుల క్రితం జోబైడెన్‌తో ప్రయాణించిన తన పాలన యంత్రాంగంలోని ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. అయితే కరోనా సోకిన ఉద్యోగి […]