సీఎం కేసీఆర్ నేడు యాదాద్రిలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రిలో యాగశాల కోసం ఎంపిక చేసిన స్థలం, ఆలయ పట్టణాన్ని మూడు నిమిషాల పాటు విహంగ వీక్షణం చేశారు. పెద్దగుట్టలోని హెలిప్యాడ్‌లో దిగే ముందు ముఖ్యమంత్రి యాదాద్రిని ఏరియల్ సర్వే చేసి యాగశాలకు ఎంపిక చేసిన స్థలం, ప్రెసిడెన్షియల్ సూట్‌లు, కొండవీటివాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పెద్దగుట్ట హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, గాదరి కిషోర్‌కుమార్ స్వాగతం పలికారు.
శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయం (బాలాలయం) లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొన్నారు. బాలాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రధాన ఆలయంలో పనులను పరిశీలించి, పునరుద్ధరించిన ఆలయాన్ని తిరిగి తెరవడంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.