శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి ప్రాజెక్ట్‌ల పునరావాసంపై స్పీకర్ తమ్మినేని సీతారాం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంశధార ఆర్ఆర్‌కాలనీలో స్థలాల కేటాయింపులో చాలా దురాక్రమణలు జరిగాయని ఆయన అన్నారు. ప్రాజెక్ట్‌లో ముంపుకు గురైన ప్రాంతవాసులు గతంలో డబ్బులు తీసుకొని మళ్లీ భూములు కావాలనటం సరికాదని ఆయన వెల్లడించారు. అర్హులు, నిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రజాప్రతినిధులు అక్రమణలు చేసి, పట్టాలు అమ్ముకోవడం చేస్తున్నారని, ఎక్వైరీ వెయ్యమని చెప్పామని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకొమని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. రిజిస్ర్టేషన్ నిలుపుదల చేయమని, డైరెక్సన్ ఇవ్వాలని కోరామని ఆయన పేర్కొన్నారు. మడ్డువలస ల్యాండ్ కాంపన్ సేషన్ లాస్ట్ పేజ్ పూర్తి చేసి ఇబ్బందులు తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.