అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. రాహుల్.. రాజీవ్ గాంధీ కుమారుడే అన్న విషయానికి రుజువులు చూపాలని బీజేపీ ఎప్పుడైనా అడిగిందా అంటూ అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ప్రశ్నించారు. దీంతో అస్సాం సీఎంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి గీతా రెడ్డి అస్సాం సీఎం వ్యాఖ్యలపై అగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీజేపీ వీక్ వికెట్ అందుకే తప్పుడు వ్యాఖ్యలు చేస్తూ రెచ్చ గొడుతుందని ఆమె అన్నారు. రాహుల్.. తండ్రి ఎవరని అడిగే నీ తండ్రి ఎవరు అని ఆయన అస్సాం సీఎంపై నిప్పులు చెరిగారు. రెచ్చ గొట్టి రాజకీయం చేయాలని బీజేపీ చూస్తుందని ఆమె పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఉద్దేశ పూర్వకంగానే మాట్లాడుతున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీ దేశంలో మతాల మధ్య చిచ్చుపెడుతోందని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ అధిష్టానం తక్షణమే అస్సం సీఎంపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.