విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆ నాటి నుంచి నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. అయితే వీరి నిరసనలకు ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలు మద్దతుగా నిలిచాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలు సైతం విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా నిలిచాయి. అయితే నేడు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో జైల్ భరోను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కూర్మన్నపాలెం మెయిన్ గేటు… జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
స్టీల్ కార్మికుల జైల్ భరోకు యువజన ప్రజా సంఘాల మద్దతుగా నిలువనున్నాయి. అయితే ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్దకు భారీగా కార్మికులు చేరుకున్నారు. జైల్‌భరో కార్యక్రమంకు మద్దతు ఇస్తూ పీపుల్ స్టార్ సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి పాల్గొన్నారు. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి జైల్ భరో కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ జైల్ భరో కార్యక్రమానికి కార్మిక, ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.