కరోనా రక్కసి మరోసారి దేశంలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల సంఖ్య ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రోజురోజు భారీగా నమోదవుతున్నాయి. గత వారం రోజుల క్రితం దేశవ్యాప్తంగా రోజుకు 50 వేల లోపు నమోదవుతున్న కరోనా కేసులు సంఖ్య తాజాగా లక్షన్నరకు చేరువలో నమోదవుతున్నాయి. దీనిబట్టే అర్థచేసుకోవచ్చు కరోనా ఏ రేంజ్లో వ్యాప్తి చెందుతుందోనని. అయితే మహారాష్ట్రలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కేవలం ముంబాయిలోనే 20వేలకుపైగా కేసులు […]
317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతాం.. కేసీఆర్.. మీరు చేయకపోతే అధికారంలోకి వచ్చాక తొలిరోజే జీవోను సవరిస్తాం.. టీచర్లూ….ఆత్మహత్యలొద్దు మీ వెంట మేమున్నాం.. అంటూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సంజయ్‌ను కలిసి 317 జీవోవల్ల ఎదురవుతున్న ఇబ్బందులు టీచర్లు వివరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న 317 జీవోను సవరించేదాకా తెగించి కొట్లాడతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ […]
సీపీఐ, సీపీఎం పార్టీల జాతీయ అగ్రనాయకత్వం శనివారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో భేటీ అయ్యారు. శుక్రవారం నుంచి ప్రారంభమై మూడు రోజుల పాటు జరుగునున్న కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు సీపీఎం పార్టీ జాతీయ నేతలు హైద్రాబాద్ కు రాగా… సీపీఐ పార్టీ అనుబంధ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మహాసభల్లో పాల్గొనేందుకు సీపీఐ నేతలు వచ్చారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసేందుకు ప్రగతి భవన్ కు విడి విడిగా వచ్చిన ఉభయ కమ్యునిస్టు పార్టీల […]
కరోనా మహమ్మారి విజృంభన రోజురోజుకు క్రమంగా పెరుగూ వస్తోంది. ఇప్పటికే దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళనకు గురిచేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణలో 73,156 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,606 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇద్దరు కరోనా బారినపడి మరణించారు. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో 285 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో […]
పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు నియోజకవర్గంలో టీడీపీ ఆధ్వర్యంలో రైతుల సమస్యలు పై నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, పాలకోల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు ఇతర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులపక్షాన పోరాడి వైసీపీ ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. రైతులకోసం కేంద్రప్రభుత్వ సాయంతో అమలుచేసే పథకాలకు జగన్ తిలోదకాలు ఇస్తున్నారని విమర్శించారు. […]
పీఆర్సీ ప్రకటన తర్వాత జీతాలు తగ్గుతాయని ఉద్యోగుల్లో ఆందోళన రేగిన మాట వాస్తవనని ఏపీ ఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. పీఆర్సీ ప్రకటన తర్వాత 4 శాతం నష్టపోయినా హెచ్ఆర్ఏ ప్రస్తుతం కొనసాగుతున్న విధంగా ఉంటే ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. అధికారుల కమిటీ సిఫార్సులను అమలు చేస్తే ఉద్యోగులు నష్టపోవాల్సిందేనని, ఇదే విషయాన్ని సీఎంఓ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డికి వివరించి చెప్పామన్నారు. పీఆర్సీ ప్రకటన తర్వాత గ్రామ వార్డు సచివాలయాల్లో కొందరు అపోహలు పడుతున్నారని […]
ఉద్యోగుల పీఆర్సీతో పాటు హెల్త్ కార్డుల విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దుపై నియమించిన కమిటీ నివేదిక అందింది జూన్ లోగా దీనిపై సహేతుకమైన నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. పెరిగిన పీఆర్సీ, 5 డీఏ బకాయిలు అన్ని ఆర్థిక ప్రయోజనాలు జనవరి 2022 నుంచే చెల్లిస్తామని తేల్చి చెప్పారని. 1.28 లక్షల మంది గ్రామ […]
పంజాబ్‌లో జరిగిన ఘటన పై తెలంగాణ ప్రజలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ముసుగులో ప్రధాని ప్రాణానికే ప్రమాదం కలిగే పన్నాగం కాంగ్రెస్ పన్నిందని ఆయన ఆరోపించారు. మన రాష్ట్ర మంత్రి కేటీఆర్ బాధ్యత రహితంగా, హేళనగా మాట్లాడారని, అక్కడి ప్రభుత్వ లోపాలను ఖండించాల్సింది పోయి.. బీజేపీ తెలంగాణలో బలోపేతం అవుతున్నదని అక్కసుతో మాట్లాడారని విమర్శించారు. కాంగ్రెస్ కి వత్తాసు పలుకుతున్నారు […]
తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తున్నాయి. ఇటీవల కరీంనగర్లో బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంతో జాతీయ స్థాయి నేతలు తెలంగాణకు తరలివచ్చారు. అంతేకాకుండా నేడు బండి సంజయ్‌కి ఏకంగా ప్రధాని మోడీ ఫోన్ చేసి దాడి, అరెస్ట్‌లపై ఆరా తీశారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతోందనే భావన కూడా తెలంగాణ ప్రజల్లో బలపడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం […]
కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. యావత్తు ప్రపంచ దేశాలతో పాటు భారత్‌లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా వైరస్ దాటికి ఎన్నో జీవితాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎంతో మంది కుటుంబ పెద్దలు కరోనా బారినపడి మరణించడంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కోవిడ్ టీకాలను కూడా పంపిణీ చేస్తోంది. దీంతో మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, ఇటీవల వెలుగు చూసిన […]