HYD Police : మీ బండిపై చలాన్ ఉందా.. అయితే మీకు గుడ్‌న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బైక్, కార్ ఇలా తాము వాడే వాహనంపై చలాన్‌లు ఉండటం.. రోడ్డుపైకి రాగానే పోలీసులు ఏ పక్క నుంచి వచ్చి ఆపి చలాన్ కట్టమంటారోనని భయంతో కాలం వెళ్లదీస్తున్న ఎంతో మంది వాహనాదారులకు హైదరాబాద్ పోలీసులు శుభవార్త చెప్పారు. పెండింగ్ చలానాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇటీవల హైదారబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో అధికారులు సమావేశమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న చలానాలకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ మార్చి 1 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనుంది. పెండింగ్ చలాన్లు క్లియర్ చేసేందుకు కొత్త ప్రతిపాదన పోలీస్ శాఖ అధికారులు తీసుకువచ్చారు.
2 వీలర్ వాహనదారులు పెండింగ్ చలాన్‌లో 25 శాతం చెల్లింపుకు అవకాశం కల్పించనున్నారు. మిగతా 75 శాతాన్ని అధికారులు మాఫీ చేయబోతున్నారు. అంతేకాకుండా కార్లకు 50 శాతం, ఆర్టీ బస్సులకు 30 శాతం, తోపుడు బండ్లకు 20 శాతం చెల్లింపునకు పోలీస్ శాఖ అవకాశం కల్పించనుంది. ఆన్‌లైన్, మీసేవా, ఆన్‌లైన్ గేట్‌వేల ద్వారా చెల్లింపునకు అవకాశం కల్పించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో రూ.600 కోట్ల పైచిలుకు పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read
తాజావార్తలు
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
-
AIMIM: వీడియో లీక్ వ్యవహారం.. మిర్జా రహమత్ బేగ్‌పై ఎంఐఎం వేటు..
-
Samantha: ప్రెగ్నెన్సీలో 11 కిలోలు పెరిగాను.. మాతృత్వంపై సమంత ఆసక్తికర కామెంట్స్!
-
CNG Price Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన CNG ధరలు.. కొత్త రేట్లు ఇవే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!