సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మరో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. విద్యారంగంలోనూ తెలంగాణను నంబర్ వన్ స్థానంలో ఉంచాలనే లక్ష్యంతో మన ఊరు- మన బడి కార్యక్రమం చేపట్టామని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా స్కూల్స్ ఎంపిక చేస్తూ.. ప్రైవేటు స్కూల్స్ దోపిడీ ని అరికట్టేందుకు ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.
పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకు రావాలని, కోటి రూపాయలు విరాళం ఇస్తే ఆ స్కూలు కు వారి పేరు పెడతామని ఆయన పేర్కొన్నారు. మొదటి విడతలోనే 65 శాతం విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించామని, 12 రకాల అంశాల్లో పాఠశాలల అభివృద్ధి చేస్తున్నామన్నారు. తాగు నీరు, విద్యుత్, ఫర్నీచర్, శానిటేషన్, కిచెన్ షెడ్, ప్రహరీ గోడల నిర్మాణం చేపడుతున్నామని ఆయన వెల్లడిమచారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే హెడ్ మాస్టర్ ల పై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.