వివేకానంద జయంతిని పురస్కరించుకొని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వివేకానందకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నానన్నారు. జాతీయ యువజనోత్సవ దినం సందర్భంగా లోకేష్ యువతకు శుభాకాంక్షలు తెలిపారు. సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరమన్నారు వివేకానంద, ఏపీలో యువత నిరాశ, నిస్పృహలో […]
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని ప్రశాంతి ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శివాని అనే గర్భిణీని వైద్యం కోసం చౌటుప్పల్‌లోని ప్రశాంతి ప్రైవేటు ఆసుప్రతికి కుటుంబ సభ్యలు తీసుకువచ్చారు. అయితే వైద్యం వికటించి ఐదు నెలల గర్భిణీ శివాని మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ.. ఆస్పత్రి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. ఆగ్రహంతో ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం చేసారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. ఘటనపై కేసు […]
టీఎస్ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి వీసీ సజ్జనార్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. టీఎస్ఆర్టీసీలో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ట్విట్టర్ వేదికగా వెల్లడిస్తున్న ప్రయాణికుల సమస్యలు క్షణాల్లోనే తీర్చతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా ఓ యువతి అర్థరాత్రి టీఎస్ఆర్టీసీ, ఎండీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేసింది. దీంతో సజ్జనార్ వెంటనే స్పందించారు. అయితే అర్ధరాత్రి సమయాలలో ఆర్టీసీ బస్సులలో మహిళల సౌకర్యం కోసం (వాష్ రూమ్స్) బస్సులను పెట్రోల్ పంప్‌లలో 10 నిమిషాలు […]
నేటి నుండి శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. పంచాహ్నిక దీక్షలతో క్షేత్రపరిధిలో 7 రోజులపాటు వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగానే ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి యగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టానున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా సాయంత్రం ధ్వజారోహణం నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఉత్సవాల సందర్భంగా ఈనెల 18 […]
గుంటూరు జిల్లాలో నేడు ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యానగర్‌లో ఐటీసీ సంస్థ నిర్మించిన గ్రాండ్ స్టార్ హోటల్‌ను ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకుంటారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్‌కు బయలుదేరి 11గంటలకు హోటల్ ను ప్రారంభిస్తారు. ప్రారంభ కార్యక్రమంలో 45 నిమిషాల పాటు పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి […]
మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పై పోలీసులు, కస్టమ్స్ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాదకద్రవ్యాల రవాణాపై అడుగడుగునా తనిఖీల చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిన అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే తాజాగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా హెరాయిన్ పట్టుబడింది. ఉగాండాకు చెందిన మహిళ ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమె వెంట తీసుకువచ్చిన లగేజి బ్యాగ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దీంతో 107 క్యాప్సల్స్లో హెరాయిన్ నింపి బట్టల మధ్యలో […]
గుంటూరు జిల్లాలో కారు ప్రమాదం చోటు చేసుకుంది. సాగర్ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. అయితే ప్రమాదానికి గురైన కారులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చినాన్న కుమారుడు మదన్ మోహన్‌రెడ్డితో పాటు ఆయన భార్య, కుమార్తెలు ఉన్నారు. కారు కాలువలోకి దూసుకెళ్లడంతో మోహన్‌రెడ్డి భార్త, కుమార్తెలు ఘటన స్థలంలోనే మరణించారు. కారు కాలువలోకి దూసకెళ్లడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. కాలువలోని నీటిలో మునిగిన కారును తీసేలోపే మోహన్‌రెడ్డి భార్య, కుమార్తెలు […]
రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులను టార్గెట్ చేస్తూ వారి వద్ద నుంచి లక్షలు దండుకుంటున్నారు. ఓ వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేసి రూ.2.89లక్షలు వసూలు చేశారు. తనకు సంబంధించిన న్యూడ్ ఫోటోలను సదరు వ్యక్తి బంధువులకు పంపుతామని బెదిరించారు. దీంతో ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపించారు. సైబర్ నేరగాళ్ల వేధింపులు అధికమవడంతో బాధితుడు సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనితో పాటు మరో వ్యక్తిని ఇన్వెస్ట్మెంట్ పేరుతో 4 లక్షలు మోసం చేశారు […]
కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. ఏపీలోనూ ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా రక్కసి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు.. ఇప్పటికే పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే వైద్యులకు సైతం కరోనా సోకుతుండడం […]
నేడు భారత్-చైనా 14వ రౌండ్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. చుషుల్-మాల్దో ప్రాంతంలో ఉదయం 9.30 గంటలకు సమావేశం జరుగనుంది. ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని రామాలయంలో తెప్పోత్సవం నిర్వహించనున్నారు. కరోనా కారణంగా ఆలయంలోనే కొలను ఏర్పాటు చేసి తెప్పోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాకుండా తెప్పోత్సవం కార్యక్రమానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. నేడు గుంటూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యానగర్‌లో ఐటీసీకి చెందిన వెల్కమ్ హోటల్‌ను ప్రారంభించనున్నారు. […]