Gangubai: ఆలియాకు కంగన అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో కంగనా రనౌత్ విమర్శల నుంచి తప్పించుకున్న వారు బహు అరుదు. ఇక వారసులను అయితే కంగనా ఓ ఆట ఆడుకుంటూ ఉంటుంది. అందులో భాగంగా ఎన్నో మార్లు ఆలియా భట్ పై విమర్శల జల్లు కరిపించింది. ఆలియాను వారి కుటుంబసభ్యులతో కలపి ‘బాలీవుడ్ మాఫియా గ్యాంగ్’ అనేసింది కూడా. ఇక ఆలియా నటించిన ‘గంగూబాయి’ సినిమా రిలీజ్‌కు ముందు 200 కోట్ల బడ్జెట్ తో తీసిన ఆ సినిమా ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరుగా మారుతుందని కంగనా సోషల్ మీడియాలో ప్రకటించేసింది. అలియాను ‘పాపా కి పరి’, ‘రోమ్‌కామ్ బింబో’ అనేసింది.
అయితే సినిమా విడుదలైన తర్వాత వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్‌ని చూసి ఆశ్చర్యానికి గురై ప్లేట్ మార్చేసింది కంగనా. తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘దక్షిణాది చిత్ర పరిశ్రమలో రికార్డ్ బద్దలు కొట్టే కలెక్షన్‌లతో థియేటర్లు కళకళలాడుతున్నాయని వినడం ఆనందంగా ఉంది. అలాగే హిందీ బెల్ట్‌లో కూడా కొన్ని బేబీ స్టెప్పులు పడుతున్నట్లు వింటున్నాను.
అవి బేబీ స్టెప్స్ కావచ్చు కానీ అవి చిన్నవి కావు. వెంటిలేటర్లపై ఉన్న థియేటర్లకు చాలా కీలకమైనవి. గొప్పవి’ అంటూ గంగూబాయిని ఆకాశానికెత్తేసింది. ఇంకా ‘సినిమా మాఫియా సందర్భానుసారంగా పెరిగి ఏదైనా మంచి చేస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అలా జరిగితే ఖచ్చితంగా మెచ్చుకుంటాము. ఉత్తమమైన వాటి కోసం ఆశిస్తున్నాను’ అని పొగిడింది కంగనా. ఇలా కంగనా తన ఇగో క్లాష్‌ను పక్కన పెట్టడం, ‘గంగూబాయి’ని ప్రశంసించడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. రెండు రోజుల క్రితం, ‘గంగూబాయి…’ కి తప్పుడు తారాగణం సెట్ అయి ఉందని, అది చిత్రానికి అతిపెద్ద లోపం అవుతుందని అన్న కంగనా ఇప్పుడు ప్రజాభిప్రాయానికి విలువనిస్తూ నిజాయితీగా పోస్ట్ చేసినందుకు ప్రశంసలు అందుకుంటోంది. ఇదిలా ఉంటే కంగనా ఆల్ట్ బాలాజీ రాబోతున్న ‘లాక్ అప్’ రియాలిటీ షో కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. మరి కంగనా ప్రశంసలకు ఆలియా ఏమని బదులిస్తుందో చూడాలి.
Also Read
- Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
- Sunitha : మై బాడీ మై రైట్ అంటే, వాడి కళ్ళు వాడి ఇష్టం!" ఫెమినిజంపై సునీత షాకింగ్ కామెంట్స్!
- Samantha: సింగిల్స్‌కు సమంత పవర్ఫుల్ అడ్వైజ్.. ఆ ఒక్క క్వాలిటీ ఉంటేనే ఓకే చెప్పండి!
- Singer Sunitha: సినీ ఇండస్ట్రీ స్త్రీలకు సేఫ్ కాదు: సింగర్ సునీత
తాజావార్తలు
-
Sunitha : నా నవ్వు, నా ఏడుపు, నా హస్కీ వాయిస్.. అన్నిటినీ సొసైటీ జడ్జ్ చేస్తూనే ఉంది
-
Trump-Netanyahu: ‘‘బీబీ నీపై విసుగొచ్చింది’’.. వెలుగులోకి ట్రంప్-నెతన్యాహు సంభాషణ
-
Bathroom Tiles Cleaning Tips: రూ.10తో బాత్రూమ్ మెరుపు.. టైల్స్ శుభ్రం చేసే ఈజీ టిప్
-
Kerala High Court: ‘‘దేవుళ్ల పేరుతో ప్రమాణం చెల్లదు’’.. బీజేపీ కార్పొరేటర్లకు హైకోర్టు షాక్..
-
Sunitha : ఆ చేతులు వేయడం తప్పట్లేదు!” కాస్టింగ్ కౌచ్‌పై సునీత సంచలన నిజాలు
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్‌కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!