గుడివాడ క్యాసినో అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. నిన్న టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ గుడివాడలోని మంత్రి కొడాలి నానికి చెందిన కె కన్వెన్షన్ లో తనిఖీలు చేసేందుకు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితుల దృష్ట్యా టీడీపీ నిజ నిర్ధారణకమిటీ సభ్యులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అయితే తాజాగా టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు బోండా ఉమా మాట్లాడుతూ.. విజయవాడ కలెక్టర్ కు గుడివాడ క్యాసినో, తనిఖీ వెళ్లిన […]
దేశంలో అంతా మోడీ మహల్ సేల్ నడుస్తుందని.. అన్నిటినీ అందులో అమ్మకానికి పెట్టారంటూ సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ విమర్శలు గుప్పించారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ఇదంతా ప్రజల సంపద.. మోడీ అయ్య జాగీరు కాదు అమ్మడానికి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. మోడీ హవా నడుస్తుంది మనం ఏం చేయగలం అనుకోకండి.. రైతులు ఢిల్లీ నీ ముట్టడించి.. చట్టాలు వెనక్కి తెచ్చేలా చేయలేదా..? మనం చూడలేదా ..? అని ఆమె మాట్లాడారు. తెలంగాణలో పొడు […]
కరోనా పట్ల తన నియోజకవర్గ ప్రజల్లో చైతన్యం నింపేందుకు పంచాయత్ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శనివారం టెలికాన్ఫరెన్స్ ద్వారా కోవిడ్ -19 బారిన పడిన పలువురితో మాట్లాడి, ధైర్యంగా ఉండాలని కోరారు. కోవిడ్-19 రోగులకు మెరుగైన చికిత్స అందించడానికి ప్రభుత్వం మరియు ఆయన స్వయంగా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలో ఫీవర్ సర్వే సందర్భంగా అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. “మీరు తప్పనిసరిగా మెడికల్ కిట్ తీసుకోవాలి […]
గాజులరామారంలో స్పోర్ట్స్ పార్కుతో పాటు ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్కు, చింతల్ భగత్‌సింగ్ నగర్లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను వచ్చే వారంలో ప్రారంభించనున్నారు. ఈ సౌకర్యాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూకట్పల్లి జోన్లో ఉన్నాయి. ప్రాణవాయు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అన్ని వయసుల వారికి వినోద సౌకర్యాలను అందిస్తుంది అని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లండించారు. టీఎస్ఐఐసీ ఏరియా, గాజులరామారం వార్డులోని స్పోర్ట్స్ పార్కును కూడా జీహెచ్ఎంసీ రూ.198.50 లక్షలతో నిర్మించింది. భగత్ సింగ్ నగర్ లో […]
హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.1.36 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు శనివారం తెలిపారు. ప్రయాణికుడు శుక్రవారం దుబాయ్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అతని వద్ద నుంచి రూ.1.36 కోట్ల విలువైన 2,715.800 గ్రాముల బంగారు వస్తువులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారాలను ఏమార్చడానికి కేటుగాడు తన వెంట తెచ్చుకున్న వస్తువుల లోపల బంగారు గొలుసులు మరియు పేస్ట్ రూపంలో […]
ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సోము వీర్రాజును ఇప్పుడు అందరూ సారా వీర్రాజు అనే పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం పై మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను సారా వీర్రాజు చేస్తున్నాడని, జగన్ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని వ్యక్తి అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి సారా వీర్రాజు.. సీఎంను దేశ ద్రోహి అని వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఒళ్లు దగ్గర […]
ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు వేసిన కామాంధులు మాత్రం మారడం లేదు. అన్యం పుణ్యం తెలియని చిన్నారులపై మృగాళ్ల పడి తమ కామవాంఛ తీర్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గణపురం మండలం అప్పయ్యపల్లి గ్రామంలో నిన్న 6 ఏళ్ల చిన్నారిపై గుర్రం కిషోర్ (28) అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. అయితే సదరు అమ్మాయి తమ్ముడు అరవడంతో నిందితుడు గుర్రం కిషోర్ పారిపోయాడు. ఈ నేపథ్యంలో నేడు పెద్దమనుషుల […]
ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు.. పింఛన్ ఇవ్వడం లేదు.. ఏపీ లో ఖజానా ఖాళీ అయింది…ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు. ఏపీలో […]
నందమూరి బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ చేస్తున్న ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఈ ప్రోగ్రాం మొదటి నుంచి అందరిని ఆకర్షిస్తోంది. ఈ ప్రోగ్రాంలో బాలయ్య హోస్ట్ గా ఇరగదీస్తున్నారనే చెప్పాలి. ఈ ప్రోగ్రాంకు వచ్చిన సినీప్రముఖులు గురించి తెలియని విషయాలను ప్రజలకు చెబుతున్నారు బాలయ్య. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకు గెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను నిన్న విడుదల చేయగా ప్రస్తుతం నెట్టింట్ల వైరల్ అవుతుంది. ఈ […]
తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంలో గ్రామ సచివాలయం వాలంటీర్లుకు వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఇన్సూరెన్స్ చేయించారు. అంతేకాకుండా ఇన్సూరెన్స్ పత్రాలను జిల్లా కలెక్టర్ హరికిరణ్ చేతులు మీదుగా వాలంటీర్లుకు అందజేశారు. జిల్లాలో అభివృద్ధి పథంలో రాజానగరం నియోజకవర్గం మొదటి స్థానంలో నిలిచిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 90 శాతం పనులు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వెల్లడించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను జిల్లా కలెక్టర్ హరికిరణ్ అభినందించారు. అంతేకాకుండా రాజానగరం […]