Telugu Desam Party Women President Vangalapudi Anita Reacted Strongly To The Remarks Made by YCP MLA Prasanna Kumar Against Her. ఇటీవల వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితపై విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ భిక్షతో 3సార్లు ఎమ్మెల్యే అయ్యారని ఆమె విమర్శించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వైసీపీలో గుర్తింపు కోసం టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది అంటూ ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. ప్రసన్నకుమార్ రెడ్డికి హైదరాబాదులో ఉన్న ఇల్లు ఎవరికి రాసిచ్చారో దమ్ముంటే చెప్పాలన్నారు.
నా క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చరిత్ర మొత్తం మీడియా ముందు ఉంచుతానని ఆమె హెచ్చరించారు. ప్రసన్న కుమార్ రెడ్డి మాటలకు, బెదిరింపులకు అనిత భయపడదని, నా గురించి అబద్ధపు ప్రచారం చేయడం అపకపోతే ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి తాట తీస్తానన్నారు. చంద్రబాబు సీఎం అవ్వగానే వైసీపీ నేతల ఇళ్ళకు వెళ్లి బడిత పూజ చేస్తామని, వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరిలో పోటీ చేసి డిపాసిట్ తెచ్చుకోగలరా..? అంటూ ఆమె ప్రశ్నించారు.