BJP state president Bandi Sanjay countered on the job vacancies announced by CM KCR today.
సీఎం కేసీఆర్ తెలంగాణలో 91 వేల పై చిలుకు ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన స్పందన లేదని, సీఎం మాటకు విలువ లేకుండా పోయిందని, మిలియన్ మార్చ్ చేస్తామని తెలుసుకొని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకు నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, 80 వేల ఉద్యోగాల భర్తీ, 11 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల రేగులరైజ్ చేస్తా అన్నారు, బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా లక్షా ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగాల భర్తీ ఆలస్యానికి కేంద్రంపై నెపం నెడుతున్నారని, కొత్త జోనల్ విధానానికి 2018లో రాష్ట్రపతి ఆమోదించారన్నారు.
అప్పటి నుంచి కేసీఆర్ ఏం చేశారని, అసెంబ్లీ సాక్షిగా కేంద్రంపై ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. 2018లో వేసిన ఫార్మా నోటిఫికేషన్ ఇప్పటి వరకు భర్తీ చేయలేదని, ఉద్యోగ క్యాలెండర్ పక్కాగా పోస్టింగ్ డేట్ తో సహా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇయ్యవు అసెంబ్లీలో ఎందుకు ప్రకటన చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే పాలాభిషేకాలు చేశారు.. నిరుద్యోగులు సీఎం కేసీఆర్ కు చేసినా పాలాభిషేకాల్లో కనిపించలేదు ఆయన స్పష్టం చేశారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం లక్షా 91 వేల మందికి ఉద్యోగ ఉత్తర్వులు ఇచ్చే వరకు, 20 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చే వరకు ఎన్నికలు వెళ్ళేది లేదని చెప్పే వరకు నిరుద్యోగులు సీఎం మాటను నమ్మరని ఆయన ఉద్ఘాటించారు. సింగరేణి ప్రమాదం దురదృష్టకరం, విచారకరమని, సింగరేణి కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.