ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 11వ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఏకమై పీఆర్సీ సాధన సమితి పేరిట ఉద్యమాన్ని ప్రారంభిచనున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ఈ క్రమంలో పీఆర్సీ సాధన సమితి నేతలు సీఎస్ సమీర్ శర్మతో సమావేశమయ్యారు. సమావేశం అనంతరం సీఎస్ కు విజ్ఞాపన పత్రాన్ని పీఆర్సీ సాధన సమితి నేతలు అందజేశారు. కొత్త పీఆర్సీ అమలు అంశాన్ని అబయెన్సులో పెట్టాల్సిందిగా సీఎస్ కు ఇచ్చిన […]
మాదక ద్రవ్యాలను రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త కొత్త పంథాలను వెతుకుతున్నారు. స్మగ్లర్లు ఎన్ని ప్లాన్లు చేసిన కస్టమ్స్ అధికారులు తిప్పికొడుతున్నారు. అలాంటి ఘటనే ఇది .. ఉగాండా దేశానికి చెందిన జూడిత్ అనే వ్యక్తి భారీగా హెరాయిన్ తరలించేందుకు ప్లాన్ చేసాడు. కస్టమ్స్ అధికారులను ఏమార్చి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పథకం పన్నాడు. దాని కోసం కేటుగాడు 7 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా హెరాయిన్ ను […]
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంత్రి కొడాలి నానికి చెందిన కల్యాణ మండపంలో క్యాసినో, పేకాట, జూదం అంటూ వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో నేడు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కృష్ణ జిల్లా లోని కొడాలి నాని కల్యాణ మండపానికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్బంగా టీడీపీ నేత బోండా ఉమ మాట్లాడుతూ.. గుడివాడలో గత కొంత కాలంగా క్యాసినో, […]
ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని.. తమ సమస్యలు పూర్తిగా పరిష్కరించాలని కోరుతూ మళ్లీ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్ లోని సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధనా సమితి పేరుతో ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. ఎన్జీవో హోంలో సమావేశానికి కొనసాగింపుగా అప్సా కార్యాలయంలో నేతల సమావేశం నిర్వహించారు. సంప్రదింపుల కోసం ప్రభుత్వం ఏర్పాటు […]
కరోనా మహమ్మారితో దేశమంతా పోరాడుతుంటే.. కరోనాను కూడా క్యాష్ చేసుకుంటున్నారు కొందరు. ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో, కరోనా వాక్సినేషన్ సర్టిఫికెట్లు కూడా నకిలీవి సృష్టించి డబ్బులు దండుకుంటున్నారు. అయితే అలాంటి రెండు ముఠాల ఆటను సౌత్ జోన్ పోలీసులు కట్టించారు. ఈ సందర్బంగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ డీసీపీ చక్రవర్తి మాట్లాడుతూ.. హైదరాబాద్ లో నకీలు ఆర్టీపీసీఆర్, కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాలను అరెస్ట్ చేశామని ఆయన తెలిపారు. రెండు గ్యాంగ్ లకు సంబంధించిన […]
ఏపీలో పీఆర్సీపై రగడ జరుగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు ఉద్యోగ సంఘాలు 11వ పీఆర్సీ కోసం క్షీరసాగర మదనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్ సమీర్ శర్మపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ చేసిన కామెంట్లను ఐఏఎస్ అధికారుల సంఘం తప్పు పట్టింది. దీంతో ఏపీ ఐఏఎస్ అధికారుల అసోసియేషనుకు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కౌంటర్ ఇచ్చింది. సీఎస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిలుకు ఛైర్మన్ హోదాలో సీఎస్ ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించాలని ఉద్యోగ సంఘాల […]
ఆరెంజ్ ఆర్మీ ముద్దుగా వార్నర్ భాయ్ అని పిలుచుకునే సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ గత ఐపీఎల్ సీజన్ లో పేలవ ఆటతీరుకు తోడు నాయకత్వ వైఫల్యాలతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో స్థానం కోల్పోవడం తెలిసిందే. టోర్నీ మధ్యలో అవమానకర పరిస్థితుల్లో వార్నర్ ను తప్పించారంటూ అప్పట్లో వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆర్సీబీలో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నాడని, రానున్న సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు డేవిడ్ భాయ్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడన్నట్లు […]
నక్కపల్లి మండలంలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారంయత్నం కేసు విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత తీవ్రంగా విరుచుకు పడ్డారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆడపిల్లలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆమె ఆరోపించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం ఉంటే ఎంత ? లేకపోతే ఎంత? అని ఆమె మండిపడ్డారు. ఆడపిల్లల తల్లితండ్రుల ఆవేదన ఇద్దరు కుమార్తెలు ఉన్న జగన్మోహన్ రెడ్డి కి తెలియదా అని […]
సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు సమీక్షా సమావేశానికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.గీతారెడ్డి, నల్లగొండ పార్లమెంటు సభ్యులు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో రైతు సంబరాలు వికారంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయమని ఆయన జ్యోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సాండ్, ల్యాండ్, మైన్స్, వైన్స్ లక్ష్యంగా పాలన సాగిస్తుందని, టీఆర్ ఎస్ పార్టీ మేనిఫెస్టో దోచుకో దాచుకో […]
తెలంగాణ లో ఉద్యోగాలు లేవనే అబద్ధప్రచారం జరుగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియామకాల్లో ఎక్కడా నిర్లక్ష్యం చేయడం లేదని, లక్ష 32 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి 40 వేల ఉద్యోగాలు ఇచ్చామని, బీజేపీ పాలిత రాష్ట్రమైన యూపీ లో 19 వేలు, బీహార్ లో 8.950 కర్ణాటక 14,893, మహారాష్ట్రలో 8వేలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ […]