టాటా గ్రూప్స్ తగ్గేదేలే అంటూ మరింత ముందుకు దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఎయిరిండియాను సొంతం చేసుకున్న టాటాగ్రూప్స్ మరో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతోంది. టాటా గ్రూప్స్ త్వరలోనే డిజిటల్ ఎకానమీలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఎన్నో సంవత్సరాల నుంచి డిజిటల్ ఎకానమీలో అగ్రస్థానంలో ఉన్న అమెజాన్, జియో, ప్లిప్ కార్ట్ లాంటి సంస్థలకు షాక్ ఇచ్చే విధంగా టాటా గ్రూప్స్ ఓ యాప్ ను లాంచ్ చేయబోతోంది. ఈ యాప్ ను ఈ నెల 7వ తేదిన […]
డ్రగ్స్ కల్చర్ చాప కింద నీరులా విస్తరించిపోతుంది. కామన్ మ్యాన్ నుంచి సెలబ్రెటీక వరకూ ఎంతో మంది డ్రగ్స్ కు బానిసలవుతున్నారు. ఇన్నాళ్లు పట్టణాలకే పరిమితమైన డ్రగ్స్, గంజాయి కల్చర్ ఇప్పుడు పల్లెల్లోకి కూడా విస్తరించి పోయింది. 15 ఏళ్ళ వయసులోనే గంజాయికి ఎడిక్ట్ అవుతోంది యువత. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన 15 ఏళ్ళ కొడుక్కి ఘాటు ట్రీట్మెంట్ ఇచ్చింది ఓ తల్లి. చిన్న తనంలో గంజాయికి బానిసైన కొడుక్కి అలవాటు మార్చుకోవాలని హెచ్చరించింది. […]
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘అంటే సుందరానికీ’. శ్యామ్ సింగరాయ్ తర్వాత నాని అభిమానుల ముందుకు రానున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ పై మేకర్స్ తాజాగా అప్డేట్ అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన నాయికగా నజ్రియా నటించింది. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. ఈ సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు […]
ధాన్యం కోనుగోళ్ల విషయమై బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయి చేరింది. ఇటీవల తెలంగాణ మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ నేడు మీడియా సమావేశం నిర్వహించి కేంద్ర బీజేపీతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మానసిక […]
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ నేతలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల పంజాబ్‌లో మాదిరిగా తెలంగాణలోనూ పూర్తిగా ధాన్యం కొనుగోళ్లు చేయాలని కోరుతూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు తెలంగాణ మంత్రులు వినతి పత్రం అందజేశారు. అయితే తెలంగాణలో ధాన్యం కొనుగోలుపై పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీంతో టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా కేంద్రంతో పాటు తెలంగాణ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ […]
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బీస్ట్. సన్ పిక్చర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 13న బీస్ట్ విడుదల కానున్నది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక అభిమానుల ఎదురుచూపులకు తెర తీశారు. బీస్ట్ థియేట్రికల్ ట్రైలర్‌ను నేడు రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. కళానిధి మారన్ నిర్మిస్తున్న […]
తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే ముస్లింలకు పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెల నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 2 నుంచి మే2 వరకు రంజాన్ ఉపవాసాలు జరుగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు వెళ్లేందుకు తెలంగాణ సర్కార్ వెలుసుబాటు కల్పించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. […]
జోగినిపల్లి సంతోష్ కుమార్ కి ప్రతిష్టాత్మక “వృక్ష్ మిత్ర సమ్మాన్ సమారోహ్” అవార్డు వరించింది. రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్ లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ వేత్త ఎరిక్ సోలీహిమ్ పాల్గొని మొక్కలు నాటారు. “ఈ అవార్డు నాదీ మాత్రమే కాదు, నా పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరిది, రేపటి సమాజం కోసం సంకల్పించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా దేశవిదేశాల్లో […]
ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 13 నుండి అత్యంత పవిత్రమైన ప్రాణహిత నది పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడం పట్ల బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రాణహిత పుష్కరాలకు తెలంగాణ నుండే కాకుండా ఛత్తీస్గడ్, మహారాష్ట్ర, ఏపీ […]
ఇటీవల ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులో పలువురు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష విధించింది. దీంతో అక్కడికక్కడే బేషరతుగా ఐఏఎస్ అధికారులు కోర్టుకు క్షమాపణలు చెప్పడంతో సేవాల కార్యక్రమాలు చేయాలని తీర్పును సవరించింది. అయితే ప్రస్తుతం ఏపీలో ఈ ఘటన హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై వివిధ రాజకీయ పార్టీల నేతలు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులకు కోర్టు శిక్ష విధించడం దేశ […]