ప్రధాని మోడీ ఈ నెల 26న హైదరాబాద్‌లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో.. ప్రధాని మోడీ టూర్ సందర్భంగా హైదరాబాద్‌లో భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు రానున్నారు ప్రధాని మోదీ. ఐఎస్‌బీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. జరిగే వార్షికోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతున్నారు. తొలిసారి ఐఎస్‌బీ మొహాలితో కలిసి ఐఎస్‌బీ హైదరాబాద్ సంయుక్త గ్రాడ్యూయేషన్ సెరిమనీ ఏర్పాటు చేసింది. 2022 పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంని 900 మంది విద్యార్ధులు కంప్లీట్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐఎస్‌బీ క్యాంపస్‌ను ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది.
అంతేకాకుండా.. స్నాతకోత్సవంలో 930 మంది ఐఎస్‌బీ విద్యార్థులలతో పాటు.. మొహాలీ క్యాంపస్ కు చెందిన 330 మంది విద్యార్థులు కూడా పాల్గొననున్నారు. అయితే.. 930 మంది విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ ని పరిశీలించిన అధికారులు.. మోడీ కి వ్యతిరేకంగా పోస్ట్ లు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. దీంతో పాటు విద్యార్థుల బ్యాక్ గ్రౌండ్ ను ఎస్పీజి అధికారులు చెక్ చేస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా పోస్ట్స్ ఉంటే క్యాంపస్‌లోకి అనుమతిని నిరాకరించనున్నారు.