ఇటీవల బేగంబజార్‌లోని షాహినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పరువు హత్య చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తమ ఇంటి ఆడబిడ్డను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని నీరజ్ పన్వార్ అనే యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి హతమార్చారు. అయితే.. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించారు. అంతేకాకుండా.. నీరజ్ హత్య కేసు నిందితుల్లో 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అయితే మరో వ్యక్తి పరారీలో ఉన్నందున.. నీరజ్ హత్య కేసు నిందితుల కస్టడీకి పోలీసులు పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో.. కస్టడీ పిటిషన్‌పై నేడు విచారణ జరిగే అవకాశం ఉంది. 7 రోజుల కస్టడీ కోరుతూ.. షాహినాథ్ గంజ్ పోలీసులు పిటిషన్‌ను వేశారు. అయితే ఇప్పటికే పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.