ఏపీ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లు ఇటీవల సీఎం జగన్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆశవాహులు మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ వర్గాల పై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్త క్యాబినెట్లో బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత పెరుగనుంది. ఈ క్రమంలో కాసేపట్లో బీసీ మంత్రుల కీలక సమావేశం నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ బీసీ మంత్రులు […]
అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ సోదరులపై విమర్శలు గుప్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిని అభివృద్ధి చేస్తూ ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి ఓర్వలేడని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా జేసీ సోదరులు 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడిపత్రికి ఎక్కువ నిధులు కేటాయించారని, అభివృద్ధి పనులు వేగంగా చేస్తున్నామన్నారు. అభివృద్ధి జరుగుతున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేసీ […]
Telangana CLP Leader Mallu Bhatti Vikramarka Support to AICC President Rahul Gandhi Protest. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. గడిచిన 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో వాహనదారులపై పెనుభారం పడుతోంది. ఇవే కాకుండా గ్యాస్ ధరలు కూడా పెంచుతూ ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ […]
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం తీవ్ర నష్టం చేసిందని, ఉభయగోదావరి జిల్లాల్లో 80 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఏ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలేదని, కౌలుదారు చట్టంలో తప్పిదాలు జరిగాయన్నారు. రైతు భరోసాకు కులాలు అంటగట్టడం దుర్మార్గమని, కౌలు రైతులు అల్లాడిపోతున్నారని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు […]
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. ప్రజలపై కేంద్ర ప్రభుత్వం పెనుభారం మోపుతోందని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖార్గే, అధిరంజన్ చౌధురి, దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు తదితర ఎంపీలు పాల్గొన్నారు. […]
TDP Leader Bonda Uma Made Comments on CM Jagan. రాష్ట్రంలో పేదలపై 3 ఏళ్లుగా జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సంక్షేమం ఇస్తున్నాం కదా అని వారిపై మోయలేని భారం మోపుతున్నారని, పేదలు, మధ్యతరగతిపై అధికంగా విద్యుత్ చార్జీలు పెంచి ధనవంతులపై భారం తగ్గించడం పిచ్చి తుగ్లక్ పాలన కాక మరేంటని ఆయన మండిపడ్డారు. జగనన్న బాదుడే బాదుడు పథకంలో ప్రజలపై రూ.38వేల కోట్ల […]
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గత వారం రోజుల నుంచి ఇంధనం ధరలు పెరుగుతూ ప్రజలపై తీవ్ర భారం మోపుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీపై, బీజేపై విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ట్విట్టర్లో.. డబుల్ ఇంజిన్ సర్కార్ అని బీజేపీవాళ్లు మొదటి నుండి చెపుతూనే ఉన్నారు మనకే అర్దం కావడం లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాకుండా డబుల్ ఇంజన్ అంటే.. పెట్రోల్ డీజిల్ ధరలు డబుల్ చేయడం, […]
చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచిన ఘనత జగనుదేనని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపు నిదర్శనమని, స్విచ్ వేయకుండానే జగన్ ప్రజలను విద్యుత్ షాక్ లకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ఇప్పటికీ ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై రూ.11,600 కోట్ల భారం మోపారని, ప్రస్తుత ఛార్జీల పెంపుతో ప్రజలపై ఏడాదికి మరో రూ.4,400 కోట్ల భారం పడనుందని […]
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మానవాళిపై భానుడికి కోపం వచ్చినట్లుంది. వేసవికాలం ప్రారంభంలోనే ఎండ తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. సూర్యుడు తగ్గేదేలే అనే విధంగా ఉగ్రరూపంలో ప్రజలపై విరుచుకుపడుతున్నాడు. ఎండ తీవ్రత దృష్ట్యా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పాఠశాల పనివేళలను కుదించింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎండలు మండుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదయ్యాయి. కొమురం భీం జిల్లా కెరమెరి లో43.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, కౌటాల లో […]