మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతనిథ్యం వహించారు. అయితే మంత్రి కొప్పులకు పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే.. ఎన్నికల ఫలితాల కౌంటింగ్ రోజున ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్ గెలిచినట్టు ప్రకటించారంటూ అడ్లూరి లక్ష్మణ్ కోర్టుకెక్కారు.
ఈ నేపథ్యంలో ఈ అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్‌పై మంత్రి కొప్పుల ఈశ్వర్ కౌంటర్ దాఖలు చేస్తూ… తన ఎన్నిక చెల్లదని చెప్పేందుకు అడ్లూరి లక్ష్మణ్ తగిన కారణాలు చూపలేదని కోర్టుకు వెల్లడించారు. అయితే.. కొప్పుల ఈశ్వర్ వాదనలు పట్టించుకోని హైకోర్టు.. పిటషన్‌ను తిరస్కరించింది. అంతేకాకుండా.. అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్ పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.