తెలంగాణలో అమ్మాయిలపై, మహిళలపై టీఆర్ఎస్ నేతలు ఆఘాయిత్యాలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాల్వాయి రజిని కుమారి నిప్పులు చెరిగారు. మంగళవారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో అకృత్యాలు, ఆగడాలు, అమానుష ఘటనలు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ నేతలు లైసెన్స్డ్ గుండాలు గా వ్యవహరిస్తున్నారని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. అమ్మాయిలు ఎలా కనిపిస్తున్నారు మీకు… భార్యలను తీసుకురమ్మని అంటున్న సిగ్గు శరం లేని నేతలు […]
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులతో పాటు వచ్చే అటెండర్లు మరియు బంధువులకు రూ.5కే భోజనం అందించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆరోగ్య అధికారులు, హరే కృష్ణ మూవ్మెంట్ (హెచ్‌కెఎం) మధ్య ఎంఓయు కుదిరింది. నగరంలోని ప్రభుత్వ తృతీయ ఆసుపత్రులలో రోగులతో పాటు వారి బంధువులకు, ప్రత్యేకించి దీర్ఘకాలం పాటు దీర్ఘకాలిక రోగులతో పాటు వచ్చే వారికి రూ.5కే పరిశుభ్రమైన భోజనం అందించనున్నారు. ప్రతి […]
కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్లలో మేనేజ్మెంట్ కోటాలో అవినీతి జరిగిందంటూ వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషికి కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు. వరంగల్ నగరంలోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలో 33 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. అందులో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 20 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 4 మైనారిటీ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీలలో […]
ఐపీఎల్-2022లో భాగంగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. బ్రబౌర్న్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడ్డాయి. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసి కేకేఆర్ ముందు భారీ స్కోరు నిలిపింది. జాస్ బట్లర్(61 బంతుల్లో 103, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సీజన్లో రెండో సెంచరీ సాధించగా.. […]
బండి సంజయ్ పాదయాత్ర ఇక్కడ చేసుడు కాదు ఢిల్లీ యాత్ర పెట్టి తెలంగాణ కు రావాల్సిన నిధులు తెప్పించు అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ బండి సంజయ్‌కు సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌కు రైతు కృతజ్ఞత సభను సోమవారం చెన్నూరులో నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న బాల్క సుమన్ మాట్లాడుతూ.. బీజేపీ లీడర్ల కొడుకులు ఏసీ ల్లో ఉంటారు.. సాధారణ బీజేపీ కార్యకర్తలు వారి కొడుకులు లొల్లి పెట్టుకొని, సోషల్ మీడియాలో పోస్టు లు చేసి […]
తెలంగాణలో ఏ పార్టీ ఏ ప్రభుత్వము ఇవ్వని కరెంటు ఉచితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తుందని రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నీ ఉడుతా ఉపులకు ఎవరు భయపడ్డారు బండి సంజయ్ అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్, బీజేపీ గాని ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టారా అని ఆయన ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా […]
తెలంగాణ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రలో నేడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జోగులాంబ జిల్లాలోని ఇటిక్యాల మంలో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ నెలకొంది. టీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ‘బండి సంజయ్ గారు చేస్తున్న ప్రజా […]
ఐపీఎల్ 2022లో భాగంగా సోమవారం రాజస్తాన్ రాయల్స్, కలకత్తా నైట్ రైడర్స్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతోంది. కేకేఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ రాయల్స్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల చేసి కేకేఆర్ ముందు భారీ స్కోరు నిలిపింది. జాస్ బట్లర్(61 బంతుల్లో 103, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సీజన్లో రెండో సెంచరీ సాధించగా.. సంజూ శాంసన్ 38 […]
మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా ‘కరణ్ అర్జున్’. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి మేకల కాగా, డా.సోమేశ్వరరావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్, రామకృష్ణ, క్రాంతి కిరణ్‌లు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ…“కరణ్ అర్జున్` టైటిల్ తో పాటు ఫస్ట్ […]
తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందరరాజన్ ప్రొటోకాల్ వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఢిల్లీలో గవర్నర్ తమిలిసై మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయం చేస్తున్నానని అనవసరంగా విమర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆధారాలు లేకుండా విమర్శిస్తున్నారని, తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా విమర్శించారని ఆయన ఆరోపించారు. పాత వీడియోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, నేను ప్రజల సమస్యలను పరిష్కరించటం తప్పా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలను కలిస్తే తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని, ఏ పదవిలో ఉన్నా, […]