తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష రద్దు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఒక పోస్ట్ చేశారు.
మెదక్ జిల్లా కేంద్రంలో మరోసారి కుండపోత వర్షం కురిసింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఏకంగా 7 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
ఉగ్రవాద సంబంధాలున్నాయనే ఆరోపణలతో బోధన్‌కు చెందిన యువకుడు ఉజైఫా యామన్ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని ఢిల్లీకి తరలించారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణపై రెవెన్యూశాఖ తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ భూ భారతి చట్టం, 2025లోని సెక్షన్ 6, సబ్-సెక్షన్ (1) ప్రకారం నమోదుకాని లావాదేవీల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తులను ప్రాసెస్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ కూకట్‌పల్లిలో వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ (45)ను దారుణంగా హత్య చేసిన ఘటన నగరాన్ని కలకలానికి గురిచేసింది. గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ నేత కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయని, కానీ తమకు అండగా నిలిచిన మాగంటి కుటుంబానికి అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.