ఫార్ములా ఈ-కార్ రేస్ కేసుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ కేసు 'లొట్టపీసు కేసు' అని, ఇందులో ఎలాంటి స్కాం జరగలేదని ఆయన అన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ ఆర్థిక, అభివృద్ధి అంశాలపై చర్చించారు.
హైదరాబాద్ నగరంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేస్‌లో అవకతవకలపై ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ రేస్‌లో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో ఏసీబీ గత తొమ్మిది నెలలుగా విచారణ జరిపింది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం భోజనం చేయడానికి వెళ్లే సమయంలో పాఠశాల భవనం ఒక్కసారిగా కూలిపోయింది.
హైదరాబాద్ శివారులోని నర్సింగి మున్సిపాలిటీలో ఓ మహిళా అధికారిణి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. నర్సింగి మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మణి హారిక మంగళవారం లంచం స్వీకరిస్తుండగా అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును ప్రభుత్వానికి చెంపపెట్టుగా అభివర్ణించిన ఆయన, గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలో తప్పులు జరిగాయని కోర్టు నమ్మినట్లు తెలిపారు.
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు మంగళవారం సంచలన తీర్పు ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్పందన ప్రకటించారు. హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వానికి “చెంపపెట్టు”గా అభివ్యక్తం చేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించడానికి జలసౌధలో రాష్ట్ర మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరై సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో స్ధానిక ఎన్నికల నిర్వహణకు సంబందించి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంలను (S-3 మోడల్) కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఈ కొత్త మోడల్ ఈవీఎంలతో ఒకే యూనిట్‌ను వివిధ ఫేజ్‌లలో పునరావృతంగా వినియోగించుకోవచ్చు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యేలు వర్మ – వంగా గీత మధ్య యూరియా సరఫరా సమస్యపై మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు రోజుల క్రితం పిఠాపురంలోని పొలాల్లో రైతుల వద్దకు వెళ్లి యూరియా సమృద్ధిగా దొరుకుతుందా అని పరిశీలించిన వర్మ, వైసీపీ ఎమ్మెల్యేలను “కళ్ళు ఉన్న కబోదులు” అని విమర్శించారు. వర్మ మాట్లాడుఊ.. “అసెంబ్లీలో వచ్చి మాట్లాడండి. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదు. ప్రభుత్వం పారదర్శకంగా యూరియా సరఫరా చేస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్న 11 నియోజకవర్గాలలో […]