Suicide : జానపద కళారంగంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జానపద నటుడు గడ్డం రాజు ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు కోల్పోయాడు. తన భార్య వేధింపులే కారణమని ఆరోపిస్తూ ఆత్మహత్యకు ముందుగా సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతన్ని ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఇటీవలే రాజు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన రాజు సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం జాఫర్ ఖాన్ పేటకు చెందిన రాజు జానపద పాటలు, వీడియోలు రూపొందించేవాడు. ఆరు నెలల క్రితం ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత అతని జీవితం ఊహించిన విధంగా సాగలేదు. పెద్ద బతుకమ్మ పండగ సందర్భంగా భార్య కోసం కొత్త చీర కొనుగోలు చేసిన రాజు, ఆ చీరతోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోలో రాజు కన్నీళ్లతో తన బాధను వ్యక్తం చేశాడు. “అమ్మా, నాన్నా… ఇక బతకలేకపోతున్నాను. ఇంట్లో ప్రతిరోజూ గొడవలు జరుగుతున్నాయి. నాకు మానసిక వేదన కలుగుతోంది. నా భార్య మిమ్మల్ని తిడుతుంది. నా పరిస్థితి ఇల్లరికం వచ్చినట్లుగా అయింది. అన్నా, వదినా… పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. సౌందర్యా, నువ్వు మంచిగా బతుకు. నీలాంటి వారికి మంచి భర్తలు దొరకరు. నీ మాటలకు నేను మెంటల్ టార్చర్ అవుతున్నాను. బతికే శక్తి లేకపోతోంది. నాకోసం బట్టలు కొనకపోయినా, భార్య కోసం చీర కొన్నాను. అమ్మా, బాపూ బై…” అంటూ రోదించాడు.
రాజు ఈ సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో, జానపద రంగం, అభిమానులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. అతని మృతితో స్థానికంగా విషాద వాతావరణం నెలకొంది.
Bihar Elections: వచ్చే వారమే బీహార్ ఎన్నికల షెడ్యూల్! ఈసీ కసరత్తు