భారత్‌ను రెండుసార్లు విభజించిందే నెహ్రూ.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్! భారత తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు. దీంతో దేశంలో వ్యవసాయానికి భారీ నష్టం జరిగిందన్నారు. కొంత కాలానికి పాకిస్తాన్‌తో తాను చేసుకున్న సింధూ నది ఒప్పందంతో 80 శాతం నీరు ఆ దేశానికి వెళ్లిపోయాయని.. భారత్‌కు […]
హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్‌ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్‌నగర్‌లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు.
హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో మైనర్ బాలిక హత్య కేసు రాష్ట్రాన్ని షాక్‌కు గురి చేసింది. బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కుటుంబానికి ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై దుండగులు దాడి చేసి హత్య చేసిన ఘటనలో పోలీసులు తాజాగా కీలక పరిణామాలను వెలుగులోకి తెచ్చారు.
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పేరును ప్రకటించడంపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ముందుకు రాలని పిలుపునిచ్చారు.
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై ఏర్పాటైన జస్టిస్ ఎల్.నరసింహ ఘోష్ కమిషన్ నివేదికను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రి హరీష్‌రావు హైకోర్టులో సవాల్ చేశారు. ఇద్దరూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసి కమిషన్ నివేదికను రద్దు చేయాలని, దానిపై అమలు చర్యలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
గణేష్ ఉత్సవాల మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి పొన్నం ప్రభాకర్! MCRHRD లో గణేష్ ఉత్సవాలు 2025 పై హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్.. జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో పాటు హైదరాబాద్ ,మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ఇంకా ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఇక […]
కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), బండి సంజయ్ (Bandi Sanjay)పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన, తెలంగాణకు రావాల్సిన యూరియా సరఫరా విషయాన్ని కేంద్రం నుంచి వెంటనే తేవాల్సిన బాధ్యత వారిదేనని స్పష్టం చేశారు.
ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని మనకు నవ్వులు పంచుతాయి, మరికొన్ని మనల్ని ఆలోచింపజేస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గాంధీ ఆస్పత్రిని సందర్శించి పేషెంట్లు, అటెండెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆస్పత్రిలో డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిసిటీ, ఫైర్ సర్వీసులు, నర్సింగ్ విభాగంలో కొరతలు ఉన్నాయని గుర్తించామని తెలిపారు.
Crypto Scam : క్రిప్టో కరెన్సీ.. ఇదొక ఊగిసలాట ట్రేడింగ్ దందా. నష్టాలు హైరిస్క్‌లో ఉంటాయి. కానీ కొంత మంది అధిక లాభాలు ఆశ చూపిస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెడితే మీ జీవితమే మారిపోతుందని చెబుతున్నారు. కానీ అమాయక జనం మాత్రం అందులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.