కరీంనగర్ జిల్లాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల పేరుతో కోట్ల రూపాయలు ఎగనామం చేసిన ముఠాపై పోలీసులు నిఘా కుదిపారు. “మూడింతల లాభాలు వస్తాయి” అంటూ ప్రజలను నమ్మబలికిన ఈ గ్యాంగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు.
నిజామాబాద్ జిల్లా మోర్తాడ్‌లో మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ రాజకీయాల్లో కొత్త దుమారం రేపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఎక్స్ (X) వేదికగా బీజేపీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. "చోటే భాయ్‌కి చీమ కూడా కుట్టకుండా పహారా కాస్తున్న బడే భాయ్ పార్టీ బీజేపీ" అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణం రాష్ట్రపతి భవన్లో 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, బీజేపీ, బీజేపీ మిత్ర పక్ష ముఖ్యమంత్రులు, ఎన్డీఏ నేతలంతా హాజరయ్యారు. అలాగే మాజీ ఉప రాష్ట్రపతులు వెంకయ్యనాయుడు, జగదీప్ ధన్కర్ దంపతులు, తదితరలంతా హాజరయ్యారు. సెప్టెంబర్ 9న జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. రాధాకృష్ణన్‌కు 452 ఓట్లు […]
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హయత్‌నగర్‌లోని పద్మావతి కాలనీలో తీవ్ర ఆందోళన నెలకొంది. వరద నీటి ధాటికి ఒక ఇంటి పునాది కొట్టుకుపోగా, దాని పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభం భవనంపైకి వరిగిపోయింది.
సైబర్ నేరగాళ్ల కొత్త తరహా బ్లాక్మెయిల్ ఉదంతం హైదరాబాద్‌లో కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ LIC ఉద్యోగిని టార్గెట్ చేసి, నాలుగు రోజులుగా నరకం చూపిస్తున్నారు.
అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చి అక్రమాలకు పాల్పడుతున్న ఒక భారీ మోసాల గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), టెలికమ్యూనికేషన్ శాఖ సంయుక్తంగా చంద్రాయణగుట్టలో జరిపిన ఆపరేషన్‌లో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దూకుడుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.