విజయవాడ: ఏపీ లిక్కర్ స్కాం కేసు. నేడు ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారణ. తన పాస్‌పోర్ట్ ఇవ్వాలని ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్. యూఎస్ వెళ్లేందుకు పాస్‌పోర్టు ఇవ్వాలని మిథున్‌రెడ్డి పిటిషన్.
లిక్కర్ కేసులో ఏ1 రాజ్‌కేసిరెడ్డి, ఏ8 చాణక్య బెయిల్ పిటిషన్లపై నేడు వాదనలు. బెయిల్ షరతులు సడలించాలని బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ చేయనున్న న్యాయస్థానం.
పల్నాడు: నేడు పోలీసులు విచారణకు పిన్నెల్లి పోలీసులు. గుండ్లపాడు జంటహత్యల కేసులో పిన్నెల్లి సోదరులను ప్రశ్నించనున్న పోలీసులు. మాచర్ల రూరల్ పీఎస్‌లో విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న పోలీసులు. జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.
ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, సజ్జల శ్రీధర్ రెడ్డి. దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై నేడు తీర్పు. నేడు తీర్పు ఇవ్వొద్దంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సిట్. కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల తరుఫు న్యాయవాదులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు.
నేడు మెదక్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన. భారీ వరదల వల్ల జరిగిన నష్టాన్ఇన అంచనా వేయనున్న బృందం. ఈ ఏడాది ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 1 వరకు మెదక్ జిల్లాకు తీరని నష్టం మిగిల్చిన వర్షాలు.
నేడు తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ. చీఫ్ జస్టిస్ కోర్టులో జరగనున్న విచారణ. నేడు చీఫ్ జస్టిస్ కోర్టులో ఐటెం నెంబర్ 42, 43. రెండు పిటిషన్లపై విచారించనున్న హైకోర్టు.
అమరావతి : PHC వైద్యులతో ప్రభుత్వం చర్చలు విఫలం. నేడు PHC డాక్టర్ల నిరాహారదీక్ష యథాతథం. ఐదేళ్లపాటు ఇన్ సర్వీస్ PG కోటా ఇవ్వాలని PHC డాక్టర్ల డిమాండ్. నేషనల్ ఇంక్రిమెంట్, ట్రైబల్ అలవెన్స్, ప్రమోషన్లు కోరుతున్న PHC వైద్యులు.
మహిళల వన్డే వరల్డ్ కప్ : నేడు ఆస్ట్రేలియా Vs పాకిస్థాన్. మధ్యాహ్నం 3 గంటలకు కొలంబో వేదికగా మ్యాచ్.
నేడు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ విస్తృతస్థాయి సమావేశం. హాజరుకానున్న రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి. ఎన్టీఆర్ జిల్లా పరిశీలకుడు వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్.
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,030. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,11,860. కిలో వెండి 1,67, 200.