అస్సాంలో భారీ భూకంపం.. ఉత్తర బెంగాల్, భూటాన్‌లోనూ ప్రకంపనలు! అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది. […]
హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ మామూలుగా ఉన్నప్పటికీ, సాయంత్రం వచ్చిన వర్షం నగర జీవనాన్ని దెబ్బతీసింది.
తెలంగాణ రవాణా శాఖ రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమైన నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 1, 2019కి ముందు రిజిస్ట్రేషన్ పొందిన అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరిగా అమర్చుకోవాలని స్పష్టం చేసింది.
హైదరాబాద్ శివారులోని చేవెళ్లలో హనీట్రాప్ ఘటన సంచలనంగా మారింది. యోగా గురువును బలవంతంగా వలలో వేసి, పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన గ్యాంగ్‌ను పోలీసులు పట్టుకున్నారు.
బోయినపల్లి మేధా స్కూల్ డ్రగ్స్ కేసులో ఒక్కొక్కటిగా కీలక అంశాలు బయటపడుతున్నాయి. స్కూల్ యజమాని మలేలా జయప్రకాశ్ గౌడ్ దాదాపు 10 నెలలుగా అల్ప్రాజొలామ్ డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.
వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచకుడు.. విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన తెలుగు టీచర్ కొందరి ఉపాధ్యాయుల తీరు పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మాయని మచ్చగా మారుతోంది. విద్యార్థులకు విద్యాబుద్ధులు బోధించి సన్మార్గంలో నడిపించాల్సిన టీచర్స్ తప్పటడుగులు వేస్తున్నారు. తమ ప్రవర్తనతో, చేష్టలతో అపకీర్తి మూటగట్టుకుంటున్నారు. బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అత్యాచార యత్నాలకు పాల్పడడం వంటివి చేస్తున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లా ములుగు (మం) లక్ష్మక్కపల్లి గ్రామంలోని వెరీటాస్ సైనిక్ స్కూల్ లో కీచక టీచర్ బాగోతం […]
హైదరాబాద్ బోయినపల్లి మేధా స్కూల్లో వెలుగులోకి వచ్చిన డ్రగ్ తయారీ కేసు సంచలనంగా మారింది. ఈగిల్ టీమ్ నిర్వహించిన సోదాల్లో స్కూల్ లోపలే అల్ప్రాజొలామ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేసిన విషయం బయటపడింది.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ముఠాలపై పోలీసులు దాడులు మరింత వేగవంతం చేశారు. ఈగిల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లలో భారీగా డ్రగ్స్ స్వాధీనం అయ్యాయి.
హారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులు మరోసారి విజయవంతమైన ఆపరేషన్ చేపట్టారు. తిర్కామేట అటవీప్రాంతంలో కూంబీంగ్ నిర్వహించిన సమయంలో అనుమానస్పదంగా తిరుగుతున్న మావోయిస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం నివాసంలో జరగనున్న ఈ సమావేశానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు.