తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాతర అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 23న సీఎం మేడారంకు వెళ్లి క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.
అన్నదమ్ముల మధ్య బంగారం చిచ్చు పెట్టింది. బంగారం కోసం.. బంధాన్ని కూడా మర్చిపోయారు. ఏకంగా అన్న కుటుంబంపై తమ్ముడు దాడి చేయడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బంధాన్ని పక్కకు పెట్టి అన్నదమ్ములు కొట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి అనుగుణంగా సైబర్ క్రైమ్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అంతరాష్ట్ర ఆపరేషన్ నిర్వహించారు. ప్రత్యేక ఆపరేషన్లో దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహించి మొత్తం 61 మంది నిందితులను అరెస్టు చేశారు.
తెలంగాణ ఎన్నికల సంఘం రాష్ట్రంలోని పలు చిన్న పార్టీలకు గుర్తింపు రద్దు హెచ్చరికగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ప్రకారం, అవసరమైన పత్రాలు సమర్పించని లేదా షరతులు పూర్తి చేయని పార్టీలు ఈ చర్యకు లక్ష్యమయ్యాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న H1B వీసాలపై కొత్త నిర్ణయాలను రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం భారతీయ సాఫ్ట్వేర్ కంపెనీలకు, చిన్న, మధ్యస్థాయిలోని టెక్ ఫిర్మ్లకు పెద్ద ఇబ్బందిని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు.
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజించడం, ప్రకృతిని ఆరాధించడం ద్వారా మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ, తెలంగాణ సంస్కృతి మరియు సాంప్రదాయాలకు ప్రత్యేక స్థానం కలిగిందని సీఎం రేవంత్ చెప్పారు. సంస్కృతి, సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీకగా బతుకమ్మను ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. తెలంగాణ సామూహిక జీవన విధానం, కష్టసుఖాలను పంచుకునే ప్రజల […]
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీ, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మహిళల సంక్షేమం, సాధికారత పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వివేక్ల సహకారంతో తెలంగాణ మహిళల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం మోపడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్న ప్రమీల#Charlapalli Murder: చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో సంచిలో లభించిన మహిళ మృతదేహం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు.