Uttam Kumar Reddy : దేవాదుల ప్రాజెక్ట్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. సోమవారం సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో తెలంగాణాలో ధాన్యం దిగుబడి రానుందనని తెలిపారు. దేశంలో తెలంగాణాలోనే ఎక్కువగా 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగిందని, ధాన్యం కొనడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.
Victor Noir Grave: మతితప్పినదా.. మదమెక్కినదా? సమాధిపై ఆ పాడు పనులు ఏంటి!
అంతేకాకుండా.. రైతు, వ్యవసాయ అనుకూల విధానాలతోనే రికార్డు దిగుబడి సాధించామని, 24 వేల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోళ్ల కోసం సిద్ధమని ఆయన వివరించారు. సూర్యాపేట జిల్లాకి పూర్తి స్థాయిలో గోదావరి జలాలు అందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సారెస్పీ పూడికతీసి ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం తెస్తామని, దేవాదుల ప్యాకేజ్ 6 కోసం 1000 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. దామోదర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా సూర్యాపేట జిల్లాకి ఎస్సారెస్పీ , దేవాదుల ద్వారా గోదావరి జలాలు తరలిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.