జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా కొనసాగింది. మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వారిలో రెండు రిజిస్టర్‌డ్ రాజకీయ పార్టీలు తరఫున ఇద్దరు అభ్యర్థులు, మిగిలిన ఎనిమిది మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి తరపున పూస శ్రీనివాస్, నవతరం పార్టీ తరపున అర్వపల్లి శ్రీనివాసరావు నామినేషన్ పత్రాలు సమర్పించారు.
Kota Vinutha: జనసేన బహిష్కృత నేత సంచలన వ్యాఖ్యలు.. చేయని తప్పుకు జైలుకు వెళ్లా..
స్వతంత్ర అభ్యర్థులుగా సిలివేరు శ్రీకాంత్, పెసరకాయల పరీక్షిత్ రెడ్డి, చలిక చంద్రశేఖర్, సపవత్ సుమన్, వేముల విక్రమ్ రెడ్డి, ఇబ్రహీం ఖాన్ తో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా సాగిందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక నామినేషన్ల స్వీకరణకు గడువు సమీపిస్తున్న కొద్దీ, మరికొంత మంది అభ్యర్థులు రంగంలోకి దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే.. తొలిరోజు ప్రధాన పార్టీల అభ్యర్థుల నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం.
Kiara Advani : వార్ 2 డిజాస్టర్ తో కియారాకి ఎదురు దెబ్బ.. ఏకంగా మూడు సినిమాల డీల్ రద్దు !