Kishan Reddy : బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ వైఫల్యం
- జూబ్లీహిల్స్ అభ్యర్థి పేరును త్వరలో ప్రకటించనున్న బీజేపీ “బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ఘోర వైఫల్యం” “50 శాతం క్యాప్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలోనే వచ్చింది”
- “సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎవ్వరూ చేయలేరు” : కిషన్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి జీ. కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై వాదనలు సమర్థవంతంగా వినిపించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. “కేంద్ర మంత్రిగా నేను ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రాష్ట్రపతిగారు కూడా ఏం చేయలేరు,” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహారాష్ట్రలో తమ ప్రభుత్వమే ఉన్నప్పటికీ, అక్కడ కూడా ఎన్నికల తర్వాత బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
“అసలు రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే. అదే కాంగ్రెస్ గతంలో సుప్రీంకోర్టులో ఆ క్యాప్‌కి వ్యతిరేకంగా వాదించడంలో విఫలమైంది. ఇప్పుడు హైకోర్టులో కూడా అదే తప్పును మళ్లీ చేసింది,” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు. “బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ ఎల్లప్పుడూ పూర్తి మద్దతు ఇస్తుంది.” అని ఆయన స్పష్టం చేశారు.
Also Read
“జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక కోసం మూడు పేర్లను జాతీయ నాయకత్వానికి పంపించాం. పార్లమెంటరీ బోర్డ్ సమావేశం తర్వాత అభ్యర్థి పేరును ప్రకటిస్తాం,” అని చెప్పారు కిషన్ రెడ్డి..
తాజావార్తలు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
ట్రెండింగ్
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్‌ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!