బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు రాష్ట్ర రాజకీయాలు, పాలన, జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు చేస్తూనే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా తీవ్రంగా విరుచుకుపడ్డారు.
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై విచారణ జరిగింది. సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన శనివారం విచారణకు హాజరయ్యారు.
కూటమి ప్రభుత్వంలో ఓ నామినేటెడ్ పోస్ట్ కోసం పవన్‌కళ్యాణ్, బాలకృష్ణ పోటీ పడ్డారా? నా మనిషికి కావాలంటే… నా మనిషికి అంటూ… వత్తిడి పెంచారా? మాంఛి సినిమా కథను తలపించిన ఆ ఎపిసోడ్లో చివరికి బాలయ్యదే పైచేయి అయిందా? రెండు పెద్ద తలకాయలు అంతలా తలపడ్డ ఆ పోస్ట్ ఏది? డిప్యూటీ సీఎంను కాదని ఎమ్మెల్యే మనిషికి ఎలా ఫైనల్ అయింది? ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా ముఖ్యమైన దేవాలయాలకు పాలక మండలి ఛైర్మన్స్‌ను నియమించింది. శ్రీశైలం, […]
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ మధ్య వృద్ధులే లక్ష్యంగా అందినకాడికి దోచేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్ల ఆటకు మరో వృద్ధుడు దారుణంగా మోసపోయాడు. అతని వద్ద నుంచి ఏకంగా రూ. 80 లక్షలు కొట్టేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో 3 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చేసేశారు. డిజిటల్ అరెస్ట్.. ఇది సైబర్ క్రిమినల్స్‌కు చాలా కీలకమైన పదం. దీన్ని ఉపయోగించి అమాయకులైన వారిని టార్గెట్ చేస్తున్నారు. వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. […]
ఇరకాటంలోపడ్డానని డిసైడైపోయిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇక ఏదైతే అదవుతుందని అనుకుంటూ… అటాకింగ్ మోడ్‌లోకి వచ్చేశారా? పాలిటిక్స్‌లో ప్రాథమిక సూత్రాన్ని గట్టిగా ఒంటబట్టిండుకున్న సదరు లీడర్ ఇప్పుడు మహనీయుల విగ్రహాలంటూ కొత్త రాగం అందుకున్నారా? తన రాజకీయ సౌలభ్యం కోసం వాళ్ళని కూడా వాడేస్తున్నాడా? ఎవరా మాజీ ఎమ్మెల్యే? ఆయన మొదలుపెట్టిన నయా రాజకీయం ఏంటి? మంథని నియోజకవర్గం… గోదావరి తీరాన్ని అనుకుని ఓ మూలన ఉన్నా…పొలిటికల్‌గా ఎప్పుడూ అందరి నోళ్లలో నానుతూ ఉండటం ఈ మంత్రపురి […]
బంగారం ధర ఆకాశాన్నంటుతోంది. లక్ష రూపాయలకు మించిపోయి చుక్కలు చూపిస్తోంది. దీంతో విదేశాల్లో తక్కువ ధరకు దొరికే బంగారాన్ని అక్రమంగా తీసుకు వచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయించేందుకు కొంత మంది కేటుగాళ్లు ప్లాన్ చేశారు. కానీ ఎయిర్ పోర్టులో దిగీదిగగానే.. DRI అధికారులను చూసి బంగారాన్ని వదిలేసి వెళ్లారు. తర్వాత ఆయా వ్యక్తులను DRI అధికారులు అరెస్ట్ చేశారు. నిత్యం ధర పెరుగుతున్న పసిడి ఇప్పుడు లాభసాటి వ్యాపారం. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా సరే.. సౌదీ అరేబియా, […]
ఆ మంత్రి గారి పుట్టినరోజు వేడుకలు కూటమిలో కుంపట్లు రాజేశాయా? ఏకంగా రెండు నియోజకవర్గాల్లో అగ్గి అంటుకుందా? ఇన్నాళ్ళు అంతర్గతంగా రగిలిపోతున్న రెండు వర్గాలు దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇప్పుడు చెలరేగుతున్నాయా? మంత్రి బర్త్ డే అయితే… కూటమి కేడర్ కొట్టుకోవాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పుట్టిన రోజు వేడుకలు తూర్పుగోదావరి జిల్లా కూటమిలో చిచ్చుపెట్టాయట. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం ఉన్న రెండు అసెంబ్లీ […]
తెలంగాణ కమలంలో కమిటీ మంటలు ఇంకా చల్లారలేదా? సీనియర్స్ ఎక్కువ మంది ఇప్పటికీ అలకపాన్పులు దిగలేదా? పదవులు రాలేదన్న బాధ ఒకరిదైతే… వచ్చిన వాళ్ళతో సైతం అసంతృప్తులు పెరుగుతున్నాయా? గతంలో రెగ్యులర్‌గా పార్టీ ఆఫీస్‌కు వచ్చిన వాళ్ళు సైతం ఇప్పుడు గేటు దగ్గరికి కూడా ఎందుకు రావడం లేదు? పార్టీలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ ప్రకటన తర్వాత అసంతృప్తుల పర్వానికి తెర లేచింది. ఆ విషయమై పార్టీలో ఆనందించే వారికంటే… ఇప్పుడు ఆవేదనతో […]
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం రెండు కొత్త పథకాలను ప్రారంభించింది. వాటి పేర్లు 'ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన', 'రేవంతన్నకా సహారా మిస్కీన్ కేలియే'. రాష్ట్ర మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ పథకాలను ప్రారంభించారు.