మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గని. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక బాక్సర్ గా వరుణ్ నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ఓటిటీ హక్కులను ఆహా వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది […]
టాలీవుడ్ స్టార్ హీరో డా. రాజశేఖర్, జీవిత ల ముద్దుల కూతుళ్లు శివాని, శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తల్లిదండ్రుల బాటలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకుంటూ స్టార్లు గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక దొరసాని తో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక ఇటీవల దుబాయ్ లో హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఎప్పుడు ఫ్యామిలీతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా దుబాయ్ లో ఒక్కత్తే ఫోటోలకు పోజులు […]
సౌత్ ఇండియాలో ఎప్పటికి మర్చిపోలేని సినిమాలను నిర్మించిన డైరెక్టర్ ఒకరు.. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టింది మరొకరు.. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని అంచలంచెలుగా పెంచుతున్న డైరెక్టర్ మరొకరు.. ఇలా ముగ్గురు గ్రేట్ టెక్నీషియన్స్ ఒకే వేదికపై కనిపిస్తే.. అభిమానుల కళ్లకు పండగే.. ప్రస్తుతం ఈ అద్భుతానికి తెరలేపిన వేదిక సీఐఐ దక్షిణ్ సౌతిండియా మీడియా అండ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్. ఈ సమ్మిట్ ఆరంభ కార్యక్రమాల్లో దర్శక దిగ్గజం మణిరత్నం, […]
బిగ్ బాస్ సీజన్ 6 నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ప్రేక్షకులకు నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. కంటెస్టెంట్ లు ఒకరిని మించి మరొకరు గేమ్స్ ఆడుతూ అదరగొడుతున్నారు. ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో కంటెస్టెంట్ ల బ్రేకప్ స్టోరీలతో రసవత్తరంగా సాగింది. ప్రతి ఒక్కరు తమ బ్రేకప్ స్టోరీని మిగతావాళ్లతో పంచుకున్నారు. అఖిల్ కూడా బ్రేకప్ స్టోరిని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ” నా బెస్ట్ ఫ్రెండ్ చిన్ను.. నేను […]
ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ల మధ్య గట్టి పోటీ ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఉన్న కథను బట్టి ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు ఒకే రోజు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సిద్దపడుతున్నారు మేకర్స్.. ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాకే ఎక్కడలేని చిక్కులు వచ్చాయా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే యశోద సినిమా రిలీజ్ డేట్ […]
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్ల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 న ఈ ఘటన జరగగా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోనమ్ ఇంట్లో పనిచేసేవారి ద్వారా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఒక ఖరీదైన ప్లాట్ లో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, అతని తల్లితండ్రులుతో […]
ప్రతిభ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మరీ పట్టం కట్టడంలో తెలుగువారికి సాటి మరెవరూ రారు. అలా పరభాషల్లో రాణించేవారిని సైతం పట్టుకు వచ్చి తెలుగు చిత్రాలలో తగిన అవకాశాలు కల్పిస్తూంటారు మనవాళ్ళు. నటి నిత్య మీనన్ సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది. 1988 ఏప్రిల్ 8న బెంగళూరులో పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే […]
తాత ఏయన్నార్ మహానటుడు. తండ్రి నాగార్జున టాప్ స్టార్. అన్న నాగచైతన్య యంగ్ హీరోస్ లో తనకంటూ ఓ స్థానం సంపాదించాడు. ఇక మిగిలింది అక్కినేని అఖిల్ వంతు. ఏడాది దాటిన వయసులోనే అఖిల్ ‘సిసింద్రీ’గా జనాన్ని మెప్పించాడు. అప్పటి నుంచీ అక్కినేని ఇంట మరో ప్రతిభావంతుడు పుట్టాడని జనం భావించారు. దోగాడే పసిపాపగా ఉన్న రోజుల్లోనే అలరించిన అఖిల్ కథానాయకునిగానూ మెప్పిస్తాడని అభిమానులు ఆశించారు. ఎందుకనో వారి ఆశలు అంతగా ఫలించలేదు. గత యేడాది ‘మోస్ట్ […]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నిర్మాత నట్టి కుమార్ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వర్మ తన సినిమాలకు నట్టి కుమార్ వద్ద రూ.5 కోట్ల 29 లక్షలు తిరిగి ఇవ్వలేదని, ఆ డబ్బు తిరిగి చెల్లించేవరకు మా ఇష్టం సినిమాను రిలీజ్ చేయకుండా ఆపాలని నట్టి కుమార్ కేసు వేశాడు. దీంతో కోర్టు సినిమాను రిలీజ్ చేయకుండా స్టే విధించింది. ఇక రామ్ గోపాల్ వర్మ ఒక మోసగాడు, అతడి బండారం బయటపెడతాను అంటూ […]