టాలీవుడ్ స్టార్ హీరో డా. రాజశేఖర్, జీవిత ల ముద్దుల కూతుళ్లు శివాని, శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తల్లిదండ్రుల బాటలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకుంటూ స్టార్లు గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక దొరసాని తో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక ఇటీవల దుబాయ్ లో హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఎప్పుడు ఫ్యామిలీతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా దుబాయ్ లో ఒక్కత్తే ఫోటోలకు పోజులు ఇవ్వడంతో ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. శివాత్మిక.. బాయ్ ఫ్రెండ్ తో దుబాయ్ పారిపోయింది.. అక్కడ ఎంజాయ్ చేస్తూ ఫోటోలు షేర్ చేస్తుంది.. బాయ్ ఫ్రెండ్ ముఖాన్ని చూపించకుండా ఎన్ని రోజులు దాస్తావ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ ట్రోల్స్ పై అమ్మడు ఆగ్రహం వ్యక్తం చేసింది.
దుబాయ్ లో కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ” ఇప్పుడు చెప్పండి.. నేను వీరితోనే దుబాయ్ వచ్చాను. ఇక ఈ బాయ్ ఫ్రెండ్ ఎవరు..? ఇంతకు దుబాయ్ పారిపోయి వచ్చింది నేనా లేదా శివానినా.? నాన్ సెన్స్ వార్తలను ఆపండి” అంటూ శివాత్మిక ప్రశ్నించింది. దీంతో ట్రోలర్స్ కి గట్టి దెబ్బే పడింది. కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే బాయ్ ఫ్రెండ్ అని వార్తలు పుట్టిస్తారా అంటూ శివాత్మిక కొద్దిగా ఘాటుగానే స్పందించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం శివాత్మిక హిరోయిన్ గా ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే. మరి ముందు ముందు ఈ ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్లుగా ఎదిగి తల్లిదండ్రుల పేరు నిలబెడతారేమో చూడాలి.