సౌత్ ఇండియాలో ఎప్పటికి మర్చిపోలేని సినిమాలను నిర్మించిన డైరెక్టర్ ఒకరు.. తెలుగు సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టింది మరొకరు.. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని అంచలంచెలుగా పెంచుతున్న డైరెక్టర్ మరొకరు.. ఇలా ముగ్గురు గ్రేట్ టెక్నీషియన్స్ ఒకే వేదికపై కనిపిస్తే.. అభిమానుల కళ్లకు పండగే.. ప్రస్తుతం ఈ అద్భుతానికి తెరలేపిన వేదిక సీఐఐ దక్షిణ్ సౌతిండియా మీడియా అండ్ మీడియా ఎంటర్ టైన్ మెంట్ సమ్మిట్. ఈ సమ్మిట్ ఆరంభ కార్యక్రమాల్లో దర్శక దిగ్గజం మణిరత్నం, దర్శక ధీరుడు రాజమౌళి. దర్శకుడు సుకుమార్ ఒకే వేదికపై సందడి చేశారు. దర్శక దిగ్గజం మణిరత్నంతో కలిసి దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి.. సుక్కూ కనిపించడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ముగ్గురు కలిసి పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నా అంబిమానులకు మాత్రం ఈ ముగ్గురు దిగ్గజాలు ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుంది.. అని ఆలోచిస్తూ హాలీవుడ్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా..? లేక సౌతిహ్ సినిమాను హాలీవుడ్ కి తీసుకెళ్లడానికి ప్లాన్ వేస్తున్నారా..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం మణిరత్నం తన డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ ని తెరకెక్కించే పనిలో ఉండగా.. రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్ ని కమిట్ అయ్యారు. ఇక సుకుమార్ .. అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 పనుల్లో బిజీగా ఉన్నారు. ఏదిఏమైనా ఈ దర్శక దిగ్గజాలు కలవడం ఎంతో ఆనందంగా ఉందని అభిమానులు ఈ ఫోటోలను వైరల్ గా మార్చేశారు.