మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గని. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 8 న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక బాక్సర్ గా వరుణ్ నట విశ్వరూపం చూపించాడనే చెప్పాలి. ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, నదియా కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా ఓటిటీ హక్కులను ఆహా వారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఇక అందుతున్న సమాచారం బట్టి ఈ సినిమా నాలుగువారాల వరకు థియేటర్లోనే సందడి చేయనుండగా ఏప్రిల్ 29 న ఓటిటీ లో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. మొదటిసారి వరుణ్ బాక్సర్ గా కనిపించాడు. దీని కోసం వరుణ్ ఎంతో కష్టపడినట్లు మేకింగ్ వీడియోల ద్వారా కనిపిస్తుంది. ఆ బాడీని బిల్డ్ చేయడానికే వరుణ్ ఎన్నో కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. ఇక ఈ సినిమాపై పలువురు కూడా స్పందిస్తున్నారు. మరి థియేటర్లో సందడి చేస్తున్న ఈ చిత్రం ఓటిటీ లో ఏ విధంగా సందడి చేయనుందో చూడాలి.