చిత్ర పరిశ్రమలో నటీమణుల వరుస మరణాలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి.. మొన్నటికి మొన్న టీనా మాస్టర్ గోవాలో అనుమాస్పదంగా మృతి చెందింది.. ఇక అది మరువకముందే నిన్నటికి నిన్న కోలీవుడ్ మోడల్ షహనా బాత్ రూమ్ లో శవంలా కనిపించింది. ఇక ఈ రెండు ఘటనలను ఇంకా మరువక ముందే మరో నటి మృత్యువాత పడింది. ప్రముఖ బెంగాలీ సీరియల్ నటి పల్లవి డే ఆత్మహత్య చేసుకోంది. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళితే.. […]
విశ్వనటుడు కమల్ హాసన్ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ్ లో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్న లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ – టర్మరిక్ మీడియా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆది పురుష్ పూర్తిచేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ రెండింటిని ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం విదితమే. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్, ప్రభాస్ కి మరో బాహుబలి లాంటి విజయాన్ని అందిస్తాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. […]
టాలీవుడ్ అడోరబుల్ కపుల్ నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు అన్యోన్యంగా ఉండి విడిపోవడం అభిమానులకు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మళ్లీ ఈ జంట కలిస్తే బావుండు అని ఇప్పటికి ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇక ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయా..? అంటే ఏమో జరగొచ్చు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఈ జంట విడిపోయాక ఒక్కసారి కూడా కలిసింది లేదు.. ఒకరి బర్త్ డే […]
యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ టీవీషో లలో చూసినా అమ్మడే కనిపిస్తూ ఉంటుంది. శ్రీముఖి వాయిస్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన దగ్గరనుంచి ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. ఆ మధ్య బొద్దుగా కనిపించిన ముద్దుగుమ్మ తాజాగా చిక్కినట్లు కనిపిస్తోంది. నిత్యం ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో విరుచుకుపడే ఈ భామపై తాజాగా ట్రోలర్స్ విరుచుకు పడ్డారు. […]
చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు కు ఉన్న లేడీ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఛార్మింగ్ లుక్, ఆయన కామెడీ టైమింగ్ కు లేడీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ఇక మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో హీరోయిన్లు కూడా ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి చాలామంది హీరోయిన్లు మహేష్ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక నేను కూడా మహేష్ బాబు అభిమానినే అని నిరూపించుకొంది ఫిదా బ్యూటీ సాయి పల్లవి.. […]
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 12 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని నమోదు చేసుకోంది. వింటేజ్ మహేష్ లుక్ సినిమాకు హైలైట్ గా నిలవడం, ఎమోషన్స్, కామెడీ టైమింగ్, కీర్తి, మహేష్ ల రొమాన్స్ తో ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాస్ ను సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ […]
ప్రస్తుతం బాలీవుడ్ లో విడాకుల పరంపర నడుస్తోంది. ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్న జంటలు.. అంతే ఇష్టంతో విడిపోవడం ట్రెండ్ గా మారింది. మేము ఇద్దరం ప్రేమికులుగా ఒక్కటయ్యాం.. స్నేహితులుగా విడిపోతున్నాం అంటూ అధికారికంగా చెప్పి మరీ విడిపోతున్నారు. ఇక్కడివరకు బాగానే ఉన్నా విడిపోయాకా కూడా తమ తమ కొత్త ప్రేమికులతో పార్టీలు చేసుకోవడం అనేది బాలీవుడ్ సెలబ్రిటీలకే చెల్లింది. ఇప్పటికే చాలామంది స్టార్లు తమ భార్యలకు విడాకులు ఇవ్వడానికి కారణం మరో హీరోయిన్ అంటూ వార్తలు […]