విశ్వనటుడు కమల్ హాసన్ అభిమానులందరు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా విక్రమ్. ఖైదీ చిత్రంతో తెలుగు, తమిళ్ లో కంటెంట్ ఉన్న డైరెక్టర్ అనిపించుకున్న లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ సమర్పణలో రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ – టర్మరిక్ మీడియా నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్, తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశానికి అంటుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకోవడమే కాకుండా ఫ్యాన్స్ కు మంచి కిక్ ను ఇస్తోంది. ముగ్గురు స్టార్ హీరోలు ఒకే ట్రైలర్ లో కనిపించి కనువిందు చేశారు.
ఇక ఈ ట్రైలర్ లో విక్రమ్ గా కమల్ హాసన్ నట విశ్వారొప్పం చూపించాడు. ”ముసుగు వేసుకున్న మనిషి మాత్రమే ముసుగు మనిషి ముఖాన్ని విప్పగలడు”.. ”ఒకరి విప్లవం మరొకరి ఉగ్రవాదం” వంటి పవర్ ఫుల్ పంచ్ లైన్ తో లోకేష్ కథను ఈ మాత్రం రివీల్ చేయకుండా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ ను కట్ చేశాడు. ఇక ముసుగు మనిషిగా ఫహద్, అతనిని వెతికే వ్యక్తిగా కమల్ కనిపించాడు. ఇక కమల్.. పోలీస్ ఆఫీసరా..? లేక గ్యాంగ్ స్టారా అనేది తెలియాలి. విజయ్ సేతుపతి ఒక రౌడీ లా మాత్రం కనిపించాడు. ఈ ముగ్గురు మీదనే కథ నడుస్తోంది అని మాత్రం హింట్ ఇచ్చారు. ట్రైలర్ లోనే కమల్- సేతుపతి- ఫహద్ ల స్క్రీన్ ప్రెజెన్స్ ని ఆస్వాదించడానికి చాలా స్కోప్ ఇచ్చారు. ఇక సినిమాలో కూడా ముగ్గురును సరిసమానంగా లోకేష్ బ్యాలెన్స్ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి ట్రైలర్ తోనే సగం హిట్ అందుకున్నదని అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. ఇకపోతే జూన్ 3న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో లోకేష్ కనగరాజన్ తన గురువు కమల్ కు హిట్ ను అందిస్తాడో లేదో చూడాలి.