టాలీవుడ్ అడోరబుల్ కపుల్ నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లు అన్యోన్యంగా ఉండి విడిపోవడం అభిమానులకు తీవ్ర ఆవేదనకు గురిచేసింది. మళ్లీ ఈ జంట కలిస్తే బావుండు అని ఇప్పటికి ఎంతోమంది ఆశపడుతున్నారు. ఇక ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయా..? అంటే ఏమో జరగొచ్చు అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఈ జంట విడిపోయాక ఒక్కసారి కూడా కలిసింది లేదు.. ఒకరి బర్త్ డే లకు ఒకరు విష్ చేసుకొన్నది లేదు.. స్నేహితులుగా విడిపోయాం అంటూనే కనీసం పలకరించుకోవడం కూడా లేదని తెలిసిందే. అయితే కొడుకుల భవిష్యత్తు గురించి అక్కినేని నాగార్జున గట్టిగా ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కెరీర్ పరంగా అక్కినేని వారసులు లైన్లో ఉన్నా ఇంకా ఎదగాలి అన్నది మాత్రం వాస్తవమే.. వరుస సివినిమాలను లైన్లో పెట్టిన చై.. కెరీర్ ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నాడు.
ఇక మరోపక్క సామ్ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్లను లైన్లో పెట్టి ముందుకు దూసుకెళ్తోంది. అయితే తాజాగా వీరి రిలేషన్ ను కాపాడే ప్రయత్నం చేస్తున్నాడట నాగ్.. ఇటీవలే కింగ్ నాగార్జున నేరుగా వెళ్లి మాజీ కోడలు సమంత నాన్న గారిని కలిసారట. సమంత – చైతన్య భవిష్యత్ బావుండాలని దానికోసం ఏదైనా చేయాలని చెప్పినట్లు సమాచారం. మరోసారి ఇరు కుటుంబాలు కూర్చొని వారిద్దరితో మాట్లాడితే బావుంటుందని ఇరు కుటుంబ సభ్యులు అనుకుంటున్నారట. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఎంత బావుండు అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విడాకుల అయిన దగ్గరనుంచి సామ్ ఎమోషనల్ కోట్స్ పోస్ట్ చేయడం, రిలేషన్ ను మిస్ అవుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి. అన్ని విభేదాలను కూర్చొని సాల్వ్ చేసుకుంటే ఈ జంట మళ్లీ కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయొచ్చు.. అలా జరగాలని కోరుకుంటున్నాం అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మరి నాగార్జున తన అనుకున్న పనిని నెరేవేరుస్తాడా..? కొడుకు, కోడలను కలుపుతాడా..? అనేది తెలియాల్సి ఉంది.