పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇప్పటికే ఆది పురుష్ పూర్తిచేసిన ప్రభాస్ ప్రాజెక్ట్ కె, సలార్ రెండింటిని ఒకేసారి పూర్తిచేసే పనిలో పడ్డాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న విషయం విదితమే. కెజిఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్, ప్రభాస్ కి మరో బాహుబలి లాంటి విజయాన్ని అందిస్తాడని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పోస్టర్స్ నుంచి లీక్డ్ పిక్స్ వరకు ప్రతిదాన్ని వైరల్ గా మార్చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్ అతి త్వరలోనే సలార్ షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు.
ఇక తాజాగా ‘సలార్’ సెట్ లో ఉన్న ప్రబస్ పిక్ ఒకటి లీక్ అయ్యింది. ఈ సినిమా కు సంబంధించిన లీక్ లను ఎవరు చేస్తున్నారు అనే విషయం లో క్లారిటీ లేదు కానీ.. లీక్ అయిన ప్రతి పిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటోంది. ఇక తాజాగా లీక్ అయినా ఫొటోలో ప్రభాస్ అదరగొట్టేశాడు. ‘కెజిఎఫ్’ చిత్రం యష్ ని తలపించేలా ఉన్నాడు. దీంతో ఈ సినిమా కెజిఎఫ్ ను కొట్టేలాగా ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది. త్వరలోనే ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతుందని టాలీవుడ్ వర్గాల గుసగుస.. మరి ఆ అప్డేట్ ఏంటీ అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సిదే.