Vennela Kishore: కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా మారిన వారు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం దగ్గరనుంచి ఈ మధ్య కామెడీతో అదరగొడుతున్న వైవా హర్ష వరకు.. హీరోగా చేసినవారు ఉన్నారు. అయితే ఇలా కమెడియన్స్ గా వచ్చిన వారిలో హీరోగా సక్సెస్ అందుకున్నా.. కంటిన్యూ చేస్తున్నవారు లేరు అని చెప్పాలి. బ్రహ్మానందం రెండు,మూడు సినిమాలు హీరోగా ప్రయత్నించాడు. కానీ, ఆయనకు సెట్ అవ్వలేదు. ఆ తరువాత సునీల్ ప్రయత్నించాడు.. అతని కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే.
Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నేడు అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపిన విషయం తెల్సిందే. తాను తల్లి కాబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించింది. ఆరేళ్ళ వివాహ బంధం తరువాత దీపికా తల్లిగా ప్రమోషన్ అందుకోబోతుంది. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా, రణ్‌వీర్‌ది స్పెషల్ ప్లేస్. వీరిద్దరి ప్రేమకథ రామ్‌లీలా సినిమా సెట్స్‌లోనే మొదలైంది.
Tantra Trailer: వకీల్ సాబ్ అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధాన పాత్రలలో శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం తంత్ర. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై నరేష్ బాబు పి, రవి చైతన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 15న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు వివాదాలు కొత్తేమి కాదు. ఎన్నోసార్లు.. ఎంతోమంది సెలబ్రిటీల గురించి నోరుజారి మాట్లాడి తరువాత క్షమాపణలు కోరాడు. ఈ మధ్య మరోసారి ఇలానే నోరుజారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల నాగబాబు.. తన కొడుకు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన విషయం తెల్సిందే.
Pawan Kalyan: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరిని వదలకుండా.. అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. తాను ఎందుకు 24 సీట్లు తీసుకున్నానో చెప్పుకొచ్చాడు. అభిమానులు తనను విమర్శిస్తున్న తీరును ఖండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క విషయాన్నీ కూడా వదిలిపెట్టలేదు.
Pawan Kalyan: ఏపీ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. ఎవరి ప్రచార వ్యూహాలను వారు సంధిస్తున్నారు. ఇక ఈసారి జనసేన- టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. తాజాగా నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అయిన తెలుగు జన విజయకేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్.. రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తున్నాయి.
Half Lion: ఓటిటీలో నెంబర్ 1 స్థానం సంపాదించడానికి ఆహా చాలా కష్టపడుతుంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ కు గట్టి పోటీని ఇస్తుంది. సినిమాలు, సిరీస్ లే కాకుండా సింగింగ్, డ్యాన్స్, కుకరీ షోస్ తో పాటు కామెడీ షోస్ తో ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇస్తుంది. ఇక తాజాగా ఆహా... ఒక అద్భుతమైన పాన్ ఇండియా సిరీస్ కు పునాది వేసింది.
Gaami: Gaami: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నాడు. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు యూనిక్ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ధమ్కీ సినిమా తరువాత విశ్వక్ ప్రేక్షకుల ముందు రాలేదు. ఇక తాజాగా విశ్వక్ నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది.
Sheeva Rana: పోకిరి సినిమా గుర్తుందా.. ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతూనే ఆడే పండుగాడు. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు మర్చిపోవడం చాలా కష్టం. మహేష్ బాబు నటన, పూరి డైలాగ్స్.. ఇలియానా అందం, బ్రహ్మీ- ఆలీ కామెడీ.. వేరే లెవెల్ సినిమా అంటే అతిశయోక్తి కాదు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరు.. స్టార్స్ గా మారారు.
Naatu Naatu: ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు స్టెప్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఈ స్టెప్స్ వేసింది. ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ, చరణ్, తారక్ ల గ్రేస్.. నెక్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎంతమంది ఎన్నిరకాలుగా చేసినా కూడా ఎన్టీఆర్, చరణ్ ను మించిన డ్యాన్సర్లు లేరు..