Pawan Kalyan: అభిమానులు నాకు ఓటు వెయ్యకపోతే నాకేం నష్టం లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: ఏపీ ఎలక్షన్స్ కు రంగం సిద్ధమైంది. ఎవరి ప్రచార వ్యూహాలను వారు సంధిస్తున్నారు. ఇక ఈసారి జనసేన- టీడీపీ కూటమిగా పోటీ చేస్తున్నాయి. తాజాగా నేడు తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అయిన తెలుగు జన విజయకేతన జెండా సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్.. రెండు తెలుగు రాష్ట్రాలను హీటెక్కిస్తున్నాయి. ఎప్పుడు లేనంతగా పవన్ ఈ సభలో గంభీరంగా , ఎమోషనల్ గా మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అధికార పక్షం పై పవన్ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇక వారితో పాటు.. తన సొంత అభిమానులే తనను మాటలు అంటున్న నేపథ్యంలో దానికి కూడా సమాధానం ఇచ్చాడు. ప్రజల సమస్యల కోసం తాను కోట్లు వదిలేసి రాజకీయాల్లోకి వస్తే.. రెండుచోట్ల ఓడించారని గుర్తుచేశాడు. అభిమానులు అని చెప్తూనే తనకు ఓటు వేయలేదని, అయినా తనకు బాధగా లేదని తెలిపాడు.
“నా అభిమానులకు కూడా చెప్తున్నాను. నన్ను కాదని మీరు జగన్ కు ఓటు వేశారు.. మర్చిపోను. ఈరోజు మీరు సఫర్ అవుతున్నారు.. నేను కాదు. మీ భవిష్యత్తు కోసం వచ్చాను నేను రోడ్ల మీదకు. శుభ్రంగా కోట్లు సంపాదించుకొనే మార్గాలు ఉన్నాయి నా దగ్గర. యాక్టింగ్ స్కిల్ ఉన్నాయి. అన్ని కాదనుకొని ఎందుకు వచ్చానంటే.. అరే నా నేలనే .. నా మనుషులే.. మనవాళ్లే.. తపనపడి, తపన పడితే రెండుచోట్ల ఓడిపోయాను. బాధ లేదు. నిలబడ్డాను. రెండుచోట్ల ఓటమి, బాధ ఎలా ఉంటుందో మీకు తెలుసా.. ? ఒక పరీక్ష పోతే బాధ ఎలా ఉంటుందో ఒక విద్యార్థికి తెలుసు. అలాంటింది నేను రెండు చోట్ల ఓడిపోతే.. నేను నిరాశ, నైరాశ్యం. బాధ ఉంది.. ఒకటే గుర్తుపెట్టుకున్నా.. దక్షిణాఫ్రికాలో ట్రైన్ లో నుంచి గెంటివేయబడ్డ గాంధీ గారు గుర్తొచ్చారు. ఎలాంటి ఆటుపోట్లు తీసుకోకుండా పార్టీని నడపలేను, అవమానాలు తీసుకోకుండా ముందుకు వెళ్ళలేను. వారందరిని స్మరించుకొని, వారి స్ఫూర్తితోటి ఈరోజు నిలబడి ఉన్నాను. బలంగా నిలబడి ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
- Subramanyam Murder Case: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో కీలక పరిణామం..
- OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
తాజావార్తలు
-
AP Collectors Conference Day 2: కలెక్టర్ల సదస్సు రెండో రోజు.. ఈ-గవర్నెన్స్ నుంచి భూ పరిపాలన వరకు కీలక చర్చలు
-
Ganesh Chaturthi 2026: వినాయక చవితి సెప్టెంబర్ 14నా? 15నా? పండితులు చెప్పిన ముహూర్తం, పూజా విధానం ఇదే..
-
Logitech MX Keypad: రూ.15,999కే Logitech MX Keypad.. 9 కస్టమైజబుల్ LCD కీస్, AI టూల్స్‌కు సపోర్ట్
-
Kanchipuram Horror: రూ.20 వేల అప్పు కోసం బాలింత నిర్బంధం.. గుడారంలోనే ప్రసవం, తల్లీబిడ్డ మృతి
-
Varun Tej Son: కొడుకు వాయువ్ ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్.. క్యూట్‌నెస్‌కు ఫ్యాన్స్ ఫిదా!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!