Naatu Naatu: ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు స్టెప్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం మొత్తం ఈ స్టెప్స్ వేసింది. ఈ సాంగ్ కు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ, చరణ్, తారక్ ల గ్రేస్.. నెక్ట్ లెవెల్ అని చెప్పాలి. ఎంతమంది ఎన్నిరకాలుగా చేసినా కూడా ఎన్టీఆర్, చరణ్ ను మించిన డ్యాన్సర్లు లేరు.. కాదు కాదు ఈ సాంగ్ లో వారిని కాకుండా వేరేవారిని ఉహించుకోలేరు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలు ఈ స్టెప్ ను రీక్రియేట్ చేశారు. ఆ హీరోలు ఎవరంటే.. బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, హాట్ హీరో టైగర్ ష్రాఫ్.
టైగర్ ష్రాప్- అక్షయ్ కుమార్ ఇద్దరూ కలిసి బడే మియాన్ చోటే మియాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మస్త్ మలాంగ్ ఝూమ్ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో ఈ హీరోలిద్దరూ.. నాటు నాటు స్టెప్ ను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వీరి డ్యాన్స్ చూసాకా.. అభిమానులు ఏదిఏమైనా ఒరిజినల్ అంత లేదురా అని తీసిపడేస్తున్నారు. ఎంతైనా ఒరిజినల్.. ఒరిజినలే కదా మరి.. మరి ఈ సినిమాతో ఈ హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Bollywood remakes the #NaatuNaatu hook step!#RRR#BadeMiyanChoteMiyan pic.twitter.com/vIv8DXArlR
— Gulte (@GulteOfficial) February 28, 2024