Deepika Padukone: బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే నేడు అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపిన విషయం తెల్సిందే. తాను తల్లి కాబోతున్నట్లు ఆమె అధికారికంగా ప్రకటించింది. ఆరేళ్ళ వివాహ బంధం తరువాత దీపికా తల్లిగా ప్రమోషన్ అందుకోబోతుంది. బాలీవుడ్ స్టార్ కపుల్స్‌లో దీపికా, రణ్‌వీర్‌ది స్పెషల్ ప్లేస్. వీరిద్దరి ప్రేమకథ రామ్‌లీలా సినిమా సెట్స్‌లోనే మొదలైంది. వారు 2012 లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఈ జంట ఇటలీలోని లేక్ కోమోలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అని తెలియడంతో అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే.. దీపికా తల్లి కాబోతున్న ఆనందం ఉన్నా ప్రభాస్ అభిమానులు మాత్రం కొద్దిగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం కల్కి.
ప్రస్తుతం దీపికా నటిస్తున్న సినిమాల్లో భారీగా హైప్ ఉన్న సినిమా అంటే ఇదే. ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో దీపికా హీరోయిన్ గా నటిస్తోంది. ఈసినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో దీపికా పాత్ర హైలైట్ గా నిలవనుందని టాక్. అయితే ఈరోజు దీపికా తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించింది అంటే.. కల్కి షూటింగ్ ను పూర్తి చేసి ఉంటుందా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం కల్కిలో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లో కూడా దీపికా కనిపించనుందని టాక్. మరి ఈ పరిస్థితిలలో ఆమె ఈ యాక్షన్ పార్ట్స్ చేస్తుందా..? లేకపోతే ఈపాటికే ఆమె ఈ షూట్ ను ఫినిష్ చేసిందా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ షూటింగ్ ను పూర్తిచేసింది అనుకుంటే.. మరి ప్రమోషన్స్ సంగతి. మేలో సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. దీపికా అప్పటికే 6 నెలల ప్రెగ్నెంట్ గా ఉంటుంది. అలా ప్రమోషన్స్ కు అటెండ్ అవ్వగలదా.. ? లేక దీపికాను ప్రమోషన్స్ నుంచి తప్పిస్తారా.. ? ఇవన్నీ అభిమానులను తొలిచేస్తున్న ప్రశ్నలు. మరి వీటికి సమాధానం దొరకాలి అంటే మే వరకు ఆగక తప్పదు.