Pawan Kalyan: అల్లు అర్జున్ కు అవార్డు రావాలని కోరుకున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరిని వదలకుండా.. అందరి ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చాడు. తాను ఎందుకు 24 సీట్లు తీసుకున్నానో చెప్పుకొచ్చాడు. అభిమానులు తనను విమర్శిస్తున్న తీరును ఖండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క విషయాన్నీ కూడా వదిలిపెట్టలేదు. ఇక ఈ సభలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి కూడా పవన్ మాట్లాడాడు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ బావుండాలి అని కోరుకున్నవాడిలో తాను ఒకడిని అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు రావాలని తాను కూడా కోరుకున్నట్లు తెలిపాడు.
” ఒక సినిమా హిట్ అయితే.. అది నాదైతే.. ఒక వారమే నేను ఉంటాను. బాలయ్య గారి సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని.. జూనియర్ ఎన్టీఆర్ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. బాహుబలి ప్రభాస్ సినిమా హిట్ అవ్వాలని కోరుకునేవాడిని, మహేష్ గారి సినిమాలు హిట్ అవ్వాలని కోరుకునేవాడిని. మెగాస్టార్ చిరంజీవి గారు అద్భుతంగా విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. రామ్ చరణ్.. విజయాలు సాధించాలని కోరుకునేవాడిని. అల్లు అర్జున్, పుష్ప హీరో.. అద్భుతంగా ఉండాలని, గొప్ప అవార్డు రావాలని కోరుకునేవాడిని.. ఇలాంటివారు ఎందరో.. వారందరి గురించి పేరుపేరునా చెప్పలేను కానీ, అందరూ బావుండాలని కోరుకునేవాడిని” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ముఖ్యంగా జనసేనాని నోట.. పుష్ప మాట రావడంతో ఆలు అర్జున్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్‌ఫర్డ్‌కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!