Vennela Kishore: కమెడియన్ గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోగా మారిన వారు చాలామంది ఉన్నారు. బ్రహ్మానందం దగ్గరనుంచి ఈ మధ్య కామెడీతో అదరగొడుతున్న వైవా హర్ష వరకు.. హీరోగా చేసినవారు ఉన్నారు. అయితే ఇలా కమెడియన్స్ గా వచ్చిన వారిలో హీరోగా సక్సెస్ అందుకున్నా.. కంటిన్యూ చేస్తున్నవారు లేరు అని చెప్పాలి. బ్రహ్మానందం రెండు,మూడు సినిమాలు హీరోగా ప్రయత్నించాడు. కానీ, ఆయనకు సెట్ అవ్వలేదు. ఆ తరువాత సునీల్ ప్రయత్నించాడు.. అతని కెరీర్ ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఇక ఈ హీరోల లిస్ట్ లోకి చేరాడు మరో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్. వెన్నెల సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. మొదటి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న వెన్నెల కిషోర్.. ఆనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా మారాడు. ఇక చాలా కాలం కమెడియన్ గా చేసిన వెన్నెల కిషోర్ మొదటిసారి హీరోగా మారాడు. అదే చారి 111. టీజీ కీర్తీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బర్కత్ స్టూడియోస్ బ్యానర్ పై అదితి సోనీ ప్రొడ్యూస్ చేశారు. చారి 111 సినిమాలో వెన్నెల కిశోర్ సరసన సంయుక్తా విశ్వనాథన్ హీరోయిన్ గా నటించింది. మార్చి 1 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక రిలీజ్ రేపు అయినా.. సినిమా పై బజ్ వచ్చిందే లేదు. అందుకు కారణం ప్రమోషన్స్ చేయకపోవడమే. వెన్నెల కిషోర్ ఏమి కొత్త నటుడు కాదు. అతని పై, అతని కామెడీపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. కానీ, ఆయన మాత్రం ప్రమోషన్స్ కు కూడా రాకపోవడం సినిమాకు పెద్ద బ్యాక్ డ్రాప్ గా మారుతుంది అనేది నిజం. ఇక ఈ విషయమై వెన్నెల కిషోర్ క్లారిటీ కూడా ఇచ్చాడు. ” నేను ఇంట్రో వర్ట్.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు రాలేను. అందులో అందరూ నన్ను పొగుడుతారు. వాటికీ ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు తెలియదు” అని చెప్పుకొచ్చాడు. అయితే దీనిపై నెటిజన్స్ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. కమెడియన్ గా ఉన్నంతవరకు ఓకే కానీ, ఒక హీరోగా మారినప్పుడు ఇవన్నీ కూడా ఉండాలి కదా.. వరుస ఇంటర్వ్యూలు అని, ప్రెస్ మీట్లు అని, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అని.. ప్రమోషన్స్ లో ఎంత ఎక్కువ మాట్లాడితే అంతగా సినిమా ప్రజలలోకి పోతుంది. హీరో కావాలంటే..ప్రమోషన్స్ కూడా ఉండాలి కదా బ్రో అని చెప్పుకోస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలంటే రేపటివరకు ఆగాల్సిందే.