Naga Babu: 5 అడుగుల మూడు అంగుళాల హీరో గురించి మాట్లాడడం తప్పే.. క్షమించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naga Babu: మెగా బ్రదర్ నాగబాబుకు వివాదాలు కొత్తేమి కాదు. ఎన్నోసార్లు.. ఎంతోమంది సెలబ్రిటీల గురించి నోరుజారి మాట్లాడి తరువాత క్షమాపణలు కోరాడు. ఈ మధ్య మరోసారి ఇలానే నోరుజారి చిక్కుల్లో పడ్డాడు. ఇటీవల నాగబాబు.. తన కొడుకు వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా విచ్చేసిన విషయం తెల్సిందే. ఇక ఆ వేదికపై నాగబాబు.. తన కొడుకును పొగుడుతూ.. పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు.. నా కొడుకు ఆరడుగులు ఉండడం వాడికి అదృష్టంగా కలిసి వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వ్యాఖ్యలు ఎంతో దుమారాన్ని రేపాయి. కొంతమంది ఈ వ్యాఖ్యలు.. ఒక హీరో గురించే మాట్లాడినట్లు వక్రీకరించడంతో.. ఆ మాటలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఇక తండ్రి మాటలపై వరుణ్ కూడా స్పందించాడు. అవి ఎవరిని ఉద్దేశించినవి కావని, ఏదో ఫ్లోలో నాగబాబు అన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక తాజాగా నాగబాబు సైతం ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నవి కావని, ఒకవేళ ఆ వ్యాఖ్యల వలన ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే క్షమించండి అంటూ ట్విట్టర్ ద్వారా పోస్ట్ పెట్టాడు. ” ఇటీవల జరిగిన వరుణ్ బాబు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి నొచ్చుకునుంటే I’m Really Very sorry,అది యాదృచ్ఛికంగా వచ్చిందే కాని Wanted గా అన్న మాటలు కాదు,అందరు అర్ధం చేసుకుని క్షమిస్తారని ఆశిస్తున్నాను.. మీ నాగబాబు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
- Veta: 'పెదరాయుడు' లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
- Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన 'ఇరుముడి'!
- Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన 'ఇరుముడి'.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన వరుణ్ బాబు 'ఆపరేషన్ వాలెంటైన్' ప్రీ రిలిజ్ ఈవెంట్ లో నేను పోలిస్ క్యారెక్టర్ 6 అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది 5 అడుగుల మూడు అంగుళాలు వ్యక్తులు చేస్తే నొప్పదు అన్నట్టు మాట్లాడాను,ఆ మాటలు నేను వెనక్కి తీస్కుంటున్నాను,ఎవరైన ఆ మాటలకి… pic.twitter.com/Ppr44YcqI8
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 29, 2024
తాజావార్తలు
-
Kavitha : నిజామాబాద్ సభలో కవిత కన్నీళ్లు.. ఆ మాటలేంటి.?
-
Supreme Court: సెప్టెంబర్ 5న ఢిల్లీలో సీజేపీ నిరసన మార్చ్.. అడ్డుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
-
Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..
-
Sumalatha: టాలీవుడ్ డ్యాన్సర్స్ యూనియన్ వివాదం.. నడిరోడ్డుపై బట్టలిప్పి కొడతానంటూ సుమలత ఫైర్
-
Telangana High Court : కల్యాణలక్ష్మికి హైకోర్టు షాక్.. రేపే కీలకం.!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!